ఔను.. ఈ మాట సీనియర్ రాజకీయ వర్గాల నుంచి.. విశ్లేషకుల వరకు కూడా వినిపిస్తోంది. కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉంది. ప్రస్తుతం కేంద్రంలో మోడీ అధికారంలో ఉండడానికి కీలకమై న రెండు ప్రధాన పార్టీల్లో టీడీపీ మరీ ముఖ్యం. బిహార్ అధికార పార్టీ జేడీయూ.. కంటే కూడా.. నలుగురు ఎంపీలు టీడీపీకే ఎక్కువగా ఉన్నారు. పైగా.. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ మాదిరిగా చంద్రబాబు ఏ క్షణాన ఎలా మారుతారో.. అన్న బెంగ కూడా లేదు.
దీంతో కేంద్రంలో చంద్రబాబు అంటే.. అత్యంత నమ్మకస్తుడైన మిత్రపక్షంగా ఉన్నారు. మరి.. ఇంత బలమైన ముద్ర వేసుకున్న చంద్రబాబు కూటమి తరఫున అనేక పనులు చేయించుకునే వెసులు బాటు ఉంటుంది. కానీ, ఈ విషయంలో వెనుకబడ్డారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్రధానంగా బనకచర్ల విషయంలో కేంద్రం నుంచి ప్రతిపాదనలు వెనక్కి రావడం చర్చగా మారింది. సరే.. దీనికి సంబంధించి కేంద్రానికి వివరణ ఇవ్వనున్నారు.
మరో ముఖ్యమైన రెండు విషయాలను గమనిస్తే.. 1) పొగాకు, 2) మామిడి. ఈ రెండు విషయాల్లోనూ.. కూడా చంద్రబాబు కేంద్రం నుంచి బలమైన మద్దతును.. ఏపీకి ప్రయోజనాలు కూడగట్టలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ రెండు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ.. కనీసం రోజుల వ్యవధిలో అయినా.. కేంద్రం నుంచి సానుకూల పరిణామాలను రాబట్టలేక పోయారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇలా.. చంద్రబాబు వైపు వేలెత్తి చూపడానికి కూడా ప్రధాన కారణం ఉంది.
అదే.. ఈ రెండు విషయాల్లో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కుమార స్వామి రాత్రికి రాత్రి సాధించడమే. జేడీఎస్ కూడా కేంద్రంలో భాగస్వామి. కానీ, ఈ పార్టీకి కేవలం ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. అయితే.. కుమారస్వామి సాధించారన్నది విశ్లేషకులు రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. కర్ణాటకలో కూడా సేమ్ టు సేమ్.. పొగాకు, మామిడి కాయల సమస్య ఉంది.
దీనిని ప్రస్తావిస్తూ.. కుమారస్వామి లేఖ రాయడంతో.. ఆ వెంటనే మామిడి కాయలను కిలోకు రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేసింది. పొగాకును కూడా అంతే యుద్ధప్రాతిపదికన కొనే ప్రక్రియను ప్రారంభించింది. కానీ.. ఏపీలో ఆ తరహా దూకుడు లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు.. 21 మంది ఎంపీలు ఉన్నా.. ఎందుకో .. చంద్రబాబు మంచితనంతో.. చాలా సహృదయంతో వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇది కేంద్రానికి మేలు చేస్తుంది కానీ.. స్థానికంగా టీడీపీకి ఇబ్బందులు తెస్తుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 5, 2025 3:54 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…