Political News

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. స‌ర్కారుపై నింద‌లు..

వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఈ నెల 3న‌(గురువారం) నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న ఆక‌స్మికంగా ర‌ద్దు చేసుకున్నారు. అంతేకాదు.. దీనికి సంబంధించి వైసీపీ నాయ‌కులు స‌ర్కారు పై నింద‌లు వేశారు. జ‌గ‌న్ నెల్లూరులో పర్య‌టించేందుకు వ‌స్తుంటే.. ప్ర‌భుత్వం క‌నీస ఏర్పాట్లు కూడా చేయ‌డం లేద‌ని.. భ‌య‌పడుతోంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. భ‌ద్ర‌త కూడా క‌ల్పించ‌డం లేద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ర‌ద్దు చేసుకున్నార‌ని తెలిపారు.

ఎందుకీ ప‌ర్య‌ట‌న‌?

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అక్ర‌మ మైనింగ్ కేసులో ప్ర‌స్తుతం నెల్లురు జైల్లో ఉన్నారు. ఈయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గురువారం ము హూర్తం పెట్టుకున్నారు. అయితే.. దీనిని తాజాగా వాయిదా వేసుకున్నారు. దీనికి కార‌ణం.. అధికారులు తాము కోరిన చోట హెలిప్యాడ్కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌న్న‌ది!. కానీ, అధికారులు మాత్రం.. తాము స‌రిగా నే హెలీ ప్యాడ్ ఏర్పాటు చేశామ‌ని అంటున్నారు. ఈ వివాదం అటు కోర్టుకు కూడా చేరింది.

అస‌లు వైసీపీ ఆలోచ‌న ఏంటి?

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో అస‌లు వైసీపీ ఆలోచ‌న ఏంటి? అనేది చూస్తే.. అధికారులు చెబుతున్న హెలీ ప్యాడ్ ద‌గ్గ ర జ‌గ‌న్ దిగితే.. నేరుగా జైలుకు వెళ్లేందుకు మాత్రమే అవ‌కాశం ఉంటుంది. దీనివల్ల ఆయ‌న ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించేందుకు.. యాత్ర‌లు చేసేందుకు.. రోడ్ల‌పై దండాలు పెట్టుకుంటూ.. కాన్వాయ్‌లో తిరిగేందుకు అవ‌కాశం ఉండ‌దు. పోలీసులు స‌రిగ్గా వెంక‌టాచ‌లంలోని సెంట్ర‌ల్ జైలుకు స‌మీపంలోనే హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీనిని వైసీపీ త‌ప్పుబ‌డుతోంది.

కానీ, అధికారులు మాత్రం.. ఇది స‌రైన నిర్ణ‌య‌మేన‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కులు.. స్థానిక సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రాంగ‌ణాన్ని చూపిస్తున్నారు. జైలుకు ఇది దాదాపు 3 కిలో మీట‌ర్ల దూరంలో ఉంది. దీంతో ఆ మూడు కిలో మీట‌ర్ల మేరకు జ‌గ‌న్ ర్యాలీగా వెళ్లి.. మ‌రో.. రెంట‌పాళ్ల‌లా చేయాల‌న్న వ్యూహం ఏదో ఉంది. ఇదే.. ఇప్పుడు వివాదం. ఎట్టి ప‌రిస్థితిలోనూ ర్యాలీల‌కు అవ‌కాశం లేకుండా చూడాల‌ని పోలీసులు.. కాదు..తాను ర్యాలీగానే జైలుకు వెళ్లి కాకాణిని ప‌రామ‌ర్శిస్తాన‌ని జ‌గ‌న్ పంతం ప‌ట్ట‌డంతో ప‌ర్య‌ట‌న ఎటూతేల‌లేదు.

This post was last modified on July 2, 2025 4:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

30 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

6 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

6 hours ago