తెలుగుదేశంపార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. రాజమండ్రి నుండి ఈయన ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు అన్నగారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. మధ్యలో రాజకీయ జీవితం కాస్త కుదుపులకు లోనైనా మళ్ళీ సర్దుకున్నది. తాజాగా మీడియా సమావేశం పెట్టిన బుచ్చయ్య తన రాజకీయ వారసుడిని ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తన సోదరుని కొడుకు డాక్టర్ రవిరామ్ ఇక నుండి తన వారసునిగా రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటారని చేసిన ప్రకటనతో బుచ్చయ్య రిటైర్ అయినట్లే అని అందరు అనుకుంటున్నారు. ప్రకటన చేయటమే కాకుండా రవి రామ్ ను మీడియా ముఖంగా పరిచయం కూడా చేశారు. వారసుడిన మీడియా ద్వారా జనాలకు పరిచయటం చేయటంతో బుచ్చయ్య రాజకీయంగా రిటైన్ అయినట్లే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. పైగా ఎన్నికల్లో పోటీ చేయించే విషయమై అధినేత నిర్ణయం తీసుకుంటారనే కటింగ్ కూడా ఇఛ్చారు లేండి.
దాదాపు 76 ఏళ్ళున్న బుచ్చయ్య ఇప్పటికి కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. బుచ్చయ్య ఆరోగ్యంపైన, గ్లామర్ పైన అసెంబ్లీలో సమావేశాల్లోనే చర్చలు జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 1994లో ఎన్టీయార్ నేతృత్వంలో ఘన విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వంలో బుచ్చయ్య పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వెన్నుపోటు కారణంగా ఎన్టీయార్ ను చంద్రబాబునాయుడు పదవిలో నుండి దింపేశారు. అప్పుడు బుచ్చయ్య పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ కు మద్దతుగా నిలిచారు.
అయితే 1995లో ఎన్టీయార్ మరణించిన తర్వాత వేరే దారిలేక మళ్ళీ చంద్రబాబు దగ్గరకే వచ్చారు. అప్పటి నుండి ఓడినా, గెలిచినా టీడీపీలోనే కంటిన్యు అవుతున్న బుచ్చయ్యకు చంద్రబాబు మాత్రం మళ్ళీ మంత్రిపదవిని ఇవ్వలేదు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి మాత్రం బుచ్చయ్యలోచా ఉంది. తన కన్నా జూనియర్లకు మంత్రిపదవులు ఇస్తున్న చంద్రబాబు తనను మాత్రం దూరంగా పెడుతున్నట్లు బాహిరంగంగానే మండిపడినపుడు పార్టీలో సంచలనం రేగింది. సరే ఏదేమైనా తాజాగా ఆయన ప్రకటన చూసిన తర్వాత తొందరలోనే తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారనేది అర్ధమైపోయింది.
This post was last modified on %s = human-readable time difference 1:57 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…