రేవంత్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవిని అప్పగిస్తారా ? కాంగ్రెస్ పార్టీలో ఇదే విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్చొచ్చింది. బీజేపీ అభ్యర్ధి రఘునందనారావు అనూహ్యంగా విజయం సాధించారు. రెండో స్ధానంలో టీఆర్ఎస్ సరిపెట్టుకోగా హస్తంపార్టీ మాత్రం మూడోస్ధానంతో సర్దుకోవాల్సొచ్చింది. సరే దీనికి కారణాలు చాలానే ఉన్నా బాధ్యత మాత్రం పిసీసీ ప్రెసిడెంట్ దే అవుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించాలని గోల పెరిగిపోతోంది.
ఇందులో భాగంగానే డిసెంబర్ మొదటివారంలో అంటే 4వ తేదీన జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను పార్టీలు బాగా ప్రిస్టేజ్ గా తీసుకుంటోంది. కాంగ్రెస్ లాగే బీజేపీ, టీఆర్ఎస్ కూడా తమ సత్తా చాటాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. సో, ఇటువంటి పరిస్దితుల్లో ఉత్తమ్ నేతృత్వంలోనే జీహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే మరో ఘోర పరాజయం తప్పదని పార్టీలోని సీనియర్ నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు.
ఇందుకనే ఉత్తమ్ ప్లేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డికి పూర్తిస్ధాయి పీసీసీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకవేళ రేవంత్ కు గనుక పగ్గాలు అప్పగిస్తే టీఆర్ఎస్ మీద పోటీ మాత్రం రసవత్తరంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కేసీయార్ అన్నా ముఖ్యమంత్రి కుటుంబమన్నా రేవంత్ బాగా కసి మీదున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద కేసీయార్+కుటుంబసభ్యుల పై ఆరోపణలు చేయాలంటే ఒక్క రేవంత్ మాత్రమే ఒంటికాలిపై లేస్తుంటారు. ఓ దశలో రేవంత్ ఆరోపణల ధాటికి కేసీయార్+కుటుంబసభ్యులు బాగా ఇబ్బందిపడ్డారు.
నూటికి నూరుశాతం కేసీయార్ ను వ్యతిరేకించేవారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే పార్టీలో జోష్ వస్తుందని చాలామంది నేతలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. నేతల వాదనకు అధిష్టానం గనుక గ్రీస్ సిగ్నల్ ఇస్తే రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించటం బాగానే ఉంటుందనే అభిప్రాయం పెరుగోతోంది. మరి అధిష్టానం ఏమి చేసినా వెంటనే చేస్తేనే ఉపయోగం ఉంటుంది. రేవంత్ యువకుడే కాబట్టి యూత్ నేతలను బాగా ఆకర్షిస్తాడంటున్నారు. పైగా రేవంత్ అంటే మామూలు జనాల్లో కూడా ఓ విధమైన క్రేజ్ ఉందట. అందుకనే పార్టీ నేతల్లో కూడా రేవంత్ కు మద్దతు పెరుగుతోంది. మరి వెంటనే నిర్ణయం తీసుకుంటుందా ? లేకపోతే చివరి నిముషం వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చి చివరి నిముషంలో మార్పులు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు.
This post was last modified on November 16, 2020 2:27 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…