Political News

సిలికాన్ వ్యాలీ – క్వాంటం వ్యాలీ : తేడా ఏంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం నుంచి `క్వాంట‌మ్ వ్యాలీ` గురించి హైలెట్ చేస్తున్నారు. దీనిని ఆయ‌న అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పోలుస్తున్నారు. అంతేకాదు.. “అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం“ అని కూడా చెబుతున్నారు. అంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే.. ఇక‌, అమెరికాకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదా?  అగ్ర‌రాజ్యంలో ఉద్యోగాల వేటతో ప‌నిలేదా? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. దీనిపైనే యువత ఎక్కువ‌గా చ‌ర్చిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో క్వాంట‌మ్ వ్యాలీ ఏర్పాటు చేసినంత మాత్రాన‌.. దీనికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి సంబంధం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. సిలికాన్ వ్యాలీ అనేది.. ప్ర‌ఖ్యాత టెక్ కంపెనీల‌కు ప్ర‌ధాన వేదిక‌. ఇక్క‌డే యాపిల్‌, మెటా, సిస్కో, ఇంటెల్‌, ఒరాకిల్‌, నొవిడియా, హెచ్‌పీ స‌హా అనేక కంపెనీలు ఉంటాయి. ఇవి హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు త‌యారు చేస్తాయి. అంతేకాదు.. బ‌హుళ జాతి కంపెనీల‌కు కూడా సిలికాన్ వ్యాలీ ఒక కీల‌క వేదిక‌. సోష‌ల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్‌కు కూడా ఈ వ్యాలీ పేరొందింది. దీంతో టెక్ రంగంలో ఉన్న‌త‌స్థాయి ఉద్యోగాలు కోరుకునేవారు.. సిలికాన్ వ్యాలీని ఎంచుకుంటారు.

అదేవిధంగా.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌న దేశంలోనూ `నేషనల్ క్వాంటం మిషన్‌`ను ప్రకటించింది. సిలికాన్ వ్యాలీ త‌ర‌హాలో భార‌త్‌లోనూ అలాంటి దిగ్గ‌జ కంపెనీల‌ను తీసుకురావాల‌న్న‌ది వ్యూహం. ఈ మిష‌న్‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే సీఎం చంద్ర‌బాబు దీనిని అందిపుచ్చుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. క్వాంటం వ్యాలీ పార్క్ కు అనుబంధంగా  పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి, వందకు పైగా యూజ్ కేసెస్ ను తీసుకువ‌స్తారు.  

వివిధ ఉపకరణాల నుంచి  రియల్-టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టి తేమ వంటి అంశాలను పర్యవేక్షించడానికి క్వాంటం కంప్యూటింగ్ , క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐలను వినియోగిస్తారు. వీటిని క్వాంట‌మ్ వ్యాలీలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఆయా రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎరో స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. కాబ‌ట్టి క్వాంట‌మ్ వ్యాలీలో కూడా ఉపాధి అవ‌కాశాలు క‌నిపిస్తాయి. కానీ.. సిలికాన్ వ్యాలీ ప్ర‌త్యేక‌త‌, క్వాంట‌మ్ వ్యాలీ ప్ర‌త్యేక‌త‌లు వేర్వేరు. 

This post was last modified on July 1, 2025 6:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago