Political News

జూనియర్ చెవిరెడ్డికీ ఇక జైలే గతి!

ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య సోమవారం నాటికి 11కి చేరింది. ఈ సంఖ్య త్వరలోనే 12కు చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ 12 అరెస్టు మరెవరిదో కాదు…చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని తెలుస్తోంది. ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్న మోహిత్ తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అటు ట్రయల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టును కూడా కోరారు. ఈ రెండు చోట్లా సోమవారం ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది.  మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు.

అదే సమయంలో లిక్కర్ స్కాంలో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు సోమవారం మరోమారు మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు సిట్ నోటీసులు జారీ చేసినా మోహిత్ విచారణకు హాజరు కాలేదు. తాను ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నానని, అవి తేలాక విచారణకు వస్తానన్న రీతిలో సాగిన మోహిత్.. రేపు విచారణకు హాజరు కాకపోతే మాత్రం సిట్ రంగంలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ మోహిత్ విచారణకు వచ్చినా.. విచారణ అనంతరం ఆయనను సిట్ అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఎప్పుడైతే చెవిరెడ్ది అరెస్టు అయ్యారో… మోహిత్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. భాస్కర్ రెడ్డి, మోహిత్ తో పాటు మరో నలుగురిని కొత్తగా కేసులో నిందితులుగా చేర్చగా… వీరిలో ఇప్పటిదాకా భాస్కర్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. మోహిత్ తో పాటు ఇంకో నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. మంగళవారం మోహిత్ విచారణకు హాజరుకాకపోతే…వీరిద్దరి కోసం సిట్ జల్లెడ పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే… మోహిత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. లండన్ ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అందులో డిస్టింక్షన్ పాసై గర్వంగా చంద్రగిరి చేరుకున్నారు. మోహిత్ చదువుకున్న రంగంలోనే ఆయన కొనసాగి ఉంటే… ఈ అరెస్టుల గోలే ఉండేది కాదు. అయితే జగన్ ఒక్కసారి సీఎం కాగానే భాస్కరరెడ్డి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఉన్నత ఉద్యోగంలో కొనసాగాల్సిన తన కుమారుడిని రాజకీయాల్లోకి దింపారు. మొన్నటి ఎన్నికల్లో తన స్థానంలో మోహిత్ ని నిలిపారు. అయితే తండ్రితో పాటు మోహిత్ కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మోహిత్ ఏకంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

This post was last modified on July 1, 2025 7:58 am

Share

Recent Posts

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

1 hour ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

3 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

4 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

4 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

4 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

6 hours ago