వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం తన సొంతూరు గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు గుడివాడ ముఖమే చూడని నాని… హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి అప్పుడే ఏడాది అయిపోయింది. అంటే.. నాని ఏడాది తర్వాత తన సొంతూరులో అడుగుపెట్టారన్న మాట.
సరే… సొంతూరు అన్న తర్వాత ఎంత గ్యాప్ తీసుకున్నా ఎప్పుడో అప్పుడు అక్కడికి తరలివెళ్లాల్సిందే. కొడాలి నాని విషయంలోనూ అదే జరిగింది. తన సొంతూరును చూసి పోదామని నాని గుడివాడకేమీ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన గుడివాడలో అడుగుపెట్టక తప్పలేదు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రావి వెంటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై వైసీపీ జమానాలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నాడే కేసు నమోదు కాగా..ఇప్పుడు ఆ కేసు ఒకింత నిందితులను చుట్టేస్తోంది.
ఈ కేసులో కొడాలి నాని నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. కేసు పూర్వపరాలు, నాని ఆరోగ్య పరిస్తితులను పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఓ లింకు పెట్టింది. స్థానిక కోర్టులో జామీను పత్రాలు సమర్పించి బెయిల్ తీసుకోమని చెప్పింది. దీంతో కొడాలి నాని తనకు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కాలం తర్వాత గుడివాడలో అడుగు పెట్టక తప్పలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైపీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని… నాటి విపక్షం, నేటి కూటమి రథసారధి టీడీపీపై తనదైన శైలిలో దూషణలకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన నాని… అందరితోనూ ఈయన ఓ బూతు మంత్రి అని ముద్ర వేయించుకున్నారు. మొన్నామధ్య వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినప్పుడు విజయవాడలో కనిపించిన నాని… ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. హైదరాబాద్, ముంబైల్లో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
This post was last modified on June 27, 2025 5:54 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…