తెలంగాణ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ధనసిరి అనసూయా అలియాస్ సీతక్కకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. నిషేధిత మావోయిస్టుల నుంచి ఆమెకు బెదిరింపుల లేఖ వచ్చిందని, అందులో ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోలు సీతక్కను హెచ్చరించారట. ఈ విషయాన్ని సీతక్క కూడా ధృవీకరించారు. తనకు మావోయిస్టుల నుంచి లేఖ వచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన ఆమె… అది నిజమైన మావోయిలస్టుల నుంచి వచ్చిందా? లేదంటే తనను రాజకీయంగా నాశనం చేసేందుకు యత్నించే శక్తుల పనా? అని ఆమె ప్రశ్నించారు.
వాస్తవానికి సీతక్క పూర్వాశ్రమంలో మావోయిస్టే. నాడు మావోయిస్టులను నక్సలైట్లుగా పిలిచేవాళ్లం. ఆదివాసీ తెగకు చెందిన సీతక్క.. చిన్న వయసులోనే నక్సలిజం సిద్ధాంతాలకు ఆకర్షితురాలై నక్సలైట్లలో కలిసిపోయారు. ఏళ్ల తరబడి నక్సలైట్ గానే కొనసాగారు. ప్రభుత్వ విధానాలపై పోరాడారు. ఇక నక్సలైట్లు పాల్పడ్డ హింసాత్మక ఘటనల్లో ఆమె పాలుపంచుకున్నారా? లేదా? అన్న దానిపై అయితే స్పష్టత లేదనే చెప్పాలి. ఎంతైనా ఏళ్ల తరబడి నక్సలైట్ గా కొనసాగిన సీతక్క… ఉమ్మడి రాష్ట్ర సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజా జీవితంలో కలిసిపోయారు. సీతక్క ఉత్సాహాన్ని చూసిన బాబు..ఆమెను టీడీపీలో చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.
ఈ లెక్కన సీతక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం అన్నది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే ప్రభుత్వ పరంగా కొన్ని కొన్ని నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నా… వాటిని చిన్నచిన్నగా సరిదిద్దుకుంటూ సీతక్క సాగుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా… నిత్యం తన ఆదివాసీ బిడ్డల సంక్షేమమే లక్ష్యంగా సాగే సీతక్క… హైదరాబాద్ లో కంటే కూడా కొండలు, కోనల్లోనూ తిరుగుతూ కనిపిస్తారు. ఇప్పుడంటే మంత్రి పదవిలో అది కూడా పంచాయతీరాజ్ శాఖ లాంటి కీలక శాఖ మంత్రిగా ఉన్న ఆమె కాస్తంత బిజీ అయినా కూడా అప్పుడప్పుడూ తన వర్గం వద్దకు వెళుతూనే ఉన్నారు.
తనకు వచ్చిన మావోయిస్టుల లేఖను ఉద్దేశించి సీతక్క శుక్రవారం ఘాటుగానే స్పందించారు. మావోయిస్టుల నుంచి లేఖ అయితే వచ్చింది గానీ… అది నిజమైన మావోయిస్టులు రాసిందా? లేదంటే మావోయిస్టుల పేరిట తన కాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటున్న తన ప్రత్యర్థుల పనా? అన్నది ముందు తేలాలని ఆమె అన్నారు. అయినా తొలిసారి ఓ ఆదివాసీ బిడ్డ మంత్రిగా ఉండటం కొందరికి కడుపు మంటగా ఉందన్న సీతక్క.. తన మంత్రి పదవిని ఊడగొట్టేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. చూడాలి మరి.. ఈ లేఖ ఎవరు రాశారో?
This post was last modified on June 27, 2025 3:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…