జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎంత చెయ్యాలో అంత చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే పవన్ మీద ఎన్నెన్ని దుష్ప్రచారాలు చేసిందో లెక్కలేదు. పవన్ గురించి సోషల్ మీడియాలో వెటకారాలు ఆడడానికి ఉపయోగించే విషయాల్లో ఆయన పుస్తక పఠనానికి సంబంధించిన రూమర్ ఒకటి. తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ చెప్పాడంటూ… దాని మీద విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. పవన్ ఎప్పుడైనా చిన్న మాట తడబడ్డా.. 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ ఎద్దేవా చేస్తుంటారు. ఐతే ఇలా ట్రోల్ చేసే వారికి పవన్ సోదరుడు నాగబాబు ఒక ఇంటర్వ్యూలో దీటైన సమాధానం ఇచ్చారు.
తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ ఎప్పుడూ చెప్పలేదని.. దానికి సంబంధించిన వీడియో ఏదైనా ఉంటే పెట్టాలని నాాగబాబు సవాలు విసిరారు. నిజానికి పవన్ పుస్తక పఠనం గురించి తమ తండ్రి వెంకట్రావు ఒక సందర్భంలో ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారని.. కానీ ఆయన చెప్పింది ఒకటైతే ఆ జర్నలిస్టు రాసింది మరొకటి అని నాగబాబు అన్నారు. పవన్ దగ్గర రూ.2 లక్షల విలువైన పుస్తకాలు ఉన్నాయని.. ఎప్పట్నుంచో లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నాడని.. చాలా శ్రద్ధగా పుస్తకాలు చదువుతాడని మాత్రమే తమ తండ్రి పేర్కొన్నారని.. కానీ ఇంటర్వ్యూ తీసుకున్న జర్నలిస్టు మాత్రం పవన్ 2 లక్షల పుస్తకాలు చదివినిట్లు రాశాడని నాగబాబు చెప్పారు.
అసలు ప్రపంచంలో ఎవ్వరైనా అన్ని పుస్తకాలు చదువుతారా… అన్ని పుస్తకాలు చదివామని చెప్పుకుంటారా అని నాగబాబు ప్రశ్నించారు. అసలు తాను ఎన్ని పుస్తకాలు చదివానన్నది పవన్ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదని.. ఈ కామెంట్ పవన్ చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని నాగబాబు సవాలు విసిరారు. గతంలో పవన్ మిత్రుడొకరు కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పారు. ఆయన ప్రత్యర్థులు మాత్రం 2 లక్షల పుస్తకాలు అంటూ పవన్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు.
This post was last modified on June 25, 2025 9:01 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…