Political News

సీఎంగా జ‌గ‌న్‌ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు?

వైసీపీ నాయ‌కులు ఇటీవ‌ల కొన్నాళ్లుగా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. మాదే గెలుపు! మాదే విజ‌యం.. జ‌గ‌న్ ప‌క్కా సీఎం.. అంటూ వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని ఆరోపి స్తున్న వైసీపీ నాయ‌కులు.. ప్ర‌జ‌లు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నార‌ని చెబుతున్నారు. అందుకే త‌మ‌కు గెలుపు అవ‌కాశాలు మెరుగు ప‌డ్డాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ఒక‌వేళ ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి ఉంటే.. వైసీపీకి వ‌చ్చే ఓట్లెన్ని.. సీట్లెన్ని? అస‌లు వైసీపీ ముచ్చట తీరుతుందా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో మూడు అంశాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

1) వైసీపీ సంస్థాగ‌త బ‌లం: ఈ విష‌యంలో 2024 నాటి లెక్క‌లు తీసుకుంటే.. అప్ప‌ట్లో బ‌ల‌మైన నాయ‌కులు వైసీపీని న‌డిపించారు. విజ‌య‌సాయిరెడ్డి స‌హా బాలినేని శ్రీనివాస‌రెడ్డి వంటి బ‌ల‌మైన నాయ‌కులు వైసీపీ జెండా ప‌ట్టుకుని.. కార్య‌రంగంలోకి దిగారు. ఇక‌, ఐదేళ్ల‌పాటు.. జ‌గ‌న్ సంక్షేమం అమ‌లు చేశామ‌ని చెప్పుకొచ్చారు. అయినా.. ప్ర‌జ‌లు వైసీపీని విశ్వ‌సించ‌లేదు. ఈ క్ర‌మంలోనే 11 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. ఇక‌, గ‌త ఏడాది కాలంలో పార్టీ దాదాపు నిర్వీర్య‌మై పోయింది. ప్ర‌జాబ‌లం.. ప్ర‌జ‌ల‌ను క‌దిలించే వ్యూహం ఉన్న నాయ‌కులు జంప్ చేసేశారు. ఇక‌, ఇప్పుడున్న‌వారిలోనూ.. బ‌ల‌మైన ప్ర‌జా మ‌ద్ద‌తు ఉన్న ధ‌ర్మాన సోద‌రులు వంటి నాయ‌కులు మౌనంగా ఉన్నారు. సో.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. అస‌లు నాయ‌కుల‌ను ఎదుర్కొనే బ‌ల‌మైన విప‌త్తు పార్టీని వెంటాడుతుంది.

2) సీఎంగా జ‌గ‌న్‌: ఇటీవ‌ల నిర్వ‌హించిన రెండు కీల‌క స‌ర్వేల్లో జ‌గ‌న్‌ను మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా కోరుకుంటున్నారా? అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. అయితే.. ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌జ‌ల నుంచి 28 శాతం మార్కులు మాత్ర‌మే ప‌డ్డాయి. అంటే.. 28 శాతం మంది మాత్ర‌మే ఆయ‌న‌ను సీఎంగా కోరుకుంటున్నారు. ఇది చాలా క‌ష్టం. 2019తో పోల్చుకుంటే.. దాదాపు స‌గానికిపైగా జ‌నాలు ఇప్పుడు ఆయ‌న‌ను తిరిగి కోరుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సో.. ఇది కూడా ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే చూపే తీవ్ర ప్ర‌భావ‌మేన‌ని చెప్పాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

3) పుంజుకోని గ్రాఫ్‌: ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. ఎదుర్కొనేందుకు పార్టీలు, నాయ‌కులు సిద్ధంగా ఉండాల‌నేది సాధార‌ణ రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న‌వారికి అర్ధ‌మ‌వుతుంది. ఈ ర‌కంగా చూసుకుంటే. వైసీపీ గ‌త ఏడాదికాలంలో పుంజుకున్న ప‌రిస్థితి లేదు. పైగా అరాచ‌క పార్టీ అనే ముద్ర‌ను జోడించుకునే క్ర‌మంలో అలుపెరుగకుండా ప‌రుగులు పెడుతోంది. దీంతో పార్టీపై ఉన్న ఆశ‌లు త‌గ్గుతున్నాయి. ఈ ప్ర‌భావం కూడా వైసీపీ ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌గ‌ణం లేక‌పోవ‌డం.. కార్య‌క‌ర్త‌లు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానానికి వైసీపీ ఆవేశ పూరిత చ‌ర్య‌ల‌కు మ‌ధ్య లింకు కుద‌ర‌క‌పోవ‌డంతో వైసీపీ గ్రాఫ్ ఇబ్బందుల్లో ప‌డింది. సో.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. వైసీపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on June 25, 2025 11:42 am

Share

Recent Posts

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

52 seconds ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

10 minutes ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

1 hour ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

3 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

4 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago