టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు ఘనవిజయాలు అందించారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇమేజ్ లేని హీరోలను స్టార్లను చేసిన.. స్టార్లను సూపర్ స్టార్లను చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి ఆయన తన కుటుంబానికి చెందిన ఆశిష్‌ను హీరోగా నిలబెట్టలేకపోతున్నారు. తన సోదరుడు శిరీష్ తనయుడైన ఆశిష్‌ను హీరోగా పెట్టి రెండు చిత్రాలు (రౌడీ బాయ్స్, లవ్ మి) నిర్మించిన రాజుకు విజయం దక్కలేదు. ఆశిష్ కొత్త ప్రాజెక్టులపై ప్రస్తుతం సరైన సమాచారం లేదు. అతను హీరోగా రెండేళ్ల ముందే ‘సెల్ఫిష్’ అనే సినిమా మొదలైంది కానీ.. అది ఎంతకీ పూర్తి కాలేదు. రిలీజ్‌కూ నోచుకోలేదు. మరోవైపు ఆశిష్ హీరోగా ‘ఆర్య-3’ చేస్తారనే ప్రచారం ఇటీవల నడిచింది. ఇంకోవైపు ‘దేత్తడి’ అంటూ మరో సినిమా తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టుల గురించి దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
‘సెల్ఫిష్’ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. అది సుకుమార్, తాను కలిసి ఒక ఐడియా నచ్చి మొదలుపెట్టిన సినిమా అని రాజు చెప్పారు. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో సినిమా మొదలైందని.. 50 శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేశామని రాజు తెలిపారు. కానీ సగం సినిమా అయ్యాక చూసుకుంటే ఔట్ పుట్ సరిగా లేదని.. దీంతో దాన్ని హోల్డ్‌లో పెట్టామని రాజు వెల్లడించారు. అన్నీ సరి చూసుకుని 100 పర్సంట్ సంతృప్తికరంగా అనిపిస్తేనే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నామని.. ప్రస్తుతానికి అది హోల్డ్‌లోనే ఉందని ఆయన చెప్పారు. ‘రౌడీ బాయ్స్’కు కరోనా వల్ల కొంత ఇబ్బంది తలెత్తిందని.. రిలీజ్ టైమింగ్ సరిగా కుదరలేదని రాజు చెప్పారు. ‘లవ్ మి’ ఆశిష్‌కు డిఫరెంట్‌గా ఉంటుందని ట్రై చేశామని.. కానీ అది పూర్తిగా మిస్ ఫైర్ అయిందని రాజు తెలిపారు.
ఇక ‘ఆర్య-3’ గురించి మాట్లాడుతూ.. తాను, సుకుమార్ కలిసి ఒక ఐడియా విషయంలో ఎగ్జైట్ అయి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించామని.. ఐతే పూర్తి కథేమీ రెడీ కాలేదని రాజు తెలిపారు. ‘ఆర్య’కు సుకుమార్ పని చేసినట్లే పిచ్చెక్కినట్లు పని చేసే దర్శకుడి కోసం చూస్తున్నామని.. స్క్రిప్టు ఎలాంటి షేప్ తీసుకుంటుందన్న దాన్ని బట్టి దాన్ని అల్లు అర్జున్‌తో చేయాలా.. ఆశిష్‌తో చేయాలా.. మరొకరిని ఎంచుకోవాలా అన్నది నిర్ణయిస్తామని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆశిష్ హీరోగా ‘దేత్తడి’తో పాటు మరో కథ కూడా ఓకే అయిందని.. ప్రస్తుతం వీటి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ‘దేత్తడి’ తమ బేనర్లోనే చేస్తామని.. ఇంకోటి బయటి బేనర్లో ఉంటుందని రాజు వెల్లడించారు.
This post was last modified on June 25, 2025 11:51 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…