Political News

ఆ ‘భూతం’ ఇక అధికారంలోకి రాదు: చంద్రబాబు

వైసీపీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టారు. ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను బెదిరించారన్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన బ్యాటరీల కంపెనీని కూడా బెదిరించారని.. దీంతో వారు తెలంగాణకు వెళ్లి.. అక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. కియా సంస్థను తాను తీసుకువచ్చానని.. కానీ వైసీపీ బెదిరించడంతో వారు రెండో విభాగాన్ని చెన్నైకి తరలించారన్నారు.

అదేవిధంగా విశాఖకు రావాల్సిన లూలూ కంపెనీని కూడా లంచాల కోసం, కమీషన్ల కోసం బెదిరించడంతో ఆ సంస్థ కూడా వెనక్కి పోయిందన్నారు. ఇలా పెట్టుబడిదారులను బెదిరించారని.. దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందన్నారు. వీటిని ఇప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. కానీ ఇక ఆ భూతం అధికారంలోకి రాదని చెబుతున్నామన్నారు. ఆ భూతాన్ని త్వరలోనే భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు.. వీటిని కూడా రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. వారిని అణిచేస్తామన్నారు.

అదేసమయంలో ప్రతి విషయంలోనూ.. ప్రతి శాఖలోనూ వైసీపీ అరాచకం చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అవినీతికి ఆలవాలంగా మార్చేశారన్నారు. మద్యం నుంచి ఇసుక వరకు.. పిల్లలకు ఇచ్చే చిక్కీ ప్రాకెట్ల నుంచి కోడిగుడ్ల వరకు కూడా అన్నీ అవినీతి చేశారన్నారు. వీటిపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కానీ వారు మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు.

నాలుగు సంతకాలు నెరవేర్చా..

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తాను నాలుగు సంతకాలు చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిని నెరవేర్చినట్టు తెలిపారు:

  1. మెగా డీఎస్సీపై సంతకం
  2. అన్నా క్యాంటీన్లు
  3. రాజధాని అమరావతి పునర్నిర్మాణం
  4. పోలవరం పనులపై సంతకం

ఈ నాలుగు కూడా సాధించామన్నారు. మెగా డీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లను 213 ప్రారంభించి పేదలకు రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తున్నామన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పనులు వడివడిగా సాగుతున్నాయన్నారు. మూడు సంవత్సరాల్లోనే ఇవి పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

This post was last modified on June 24, 2025 1:56 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

1 hour ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

1 hour ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

4 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

4 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

8 hours ago