రాష్ట్రంలో యోగాంధ్ర సక్సెస్ వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని.. ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. “సమాజంలోని అనేక వర్గాలను ఏకం చేయడం ద్వారా.. ఒకటిన్నర నెలల కాలంలో.. యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ కు ప్రత్యేక అభినందనలు” అని వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ చేసిన కృషి.. దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఒక నమూనాగా ఉంటుందని ప్రధాని తెలిపారు. ప్రపంచ దేశాలను, వ్యక్తులను యోగా ఏకం చేసిందని పేర్కొన్నారు. పది సంవత్సరాల కిందట అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 175 దేశాల్లో యోగా సాధన చేయడంతోపాటు.. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు.
యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియగా ప్రధాని పేర్కొన్నారు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని, గ్రామగ్రామాల్లో యువకులు కూడా యోగాను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవని మోడీ వ్యాఖ్యానించారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎక్కువగా నారా లోకేష్‌ను మోడీ ప్రస్తావించడం గమనార్హం. ముఖ్యంగా శుక్రవారం నిర్వహించిన 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాల విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దీనిని సక్సెస్ చేయడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందన్నారు.
This post was last modified on June 21, 2025 10:38 am
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…