టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సినిమా రంగానికే చెందిన యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఎమ్యెల్యేగా ఉంటే ఎం?… లేకపోతే ఎంత అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హిందూపురంలో పర్యటించిన శ్యామల…పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీని టీడీపీ గానీ, బాలకృష్ణ గానీ ఏ మేర నెరవరేర్చారని ఆమె ప్రశ్నించారు.
హిందూపురంలో బాలకృష్ణ వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారని శ్యామల అన్నారు. హిందూపురం ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్న బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసలు బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో ఎన్నిసార్లు హిందూపురం వచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడు హిందూపురం వచ్చినా…ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లుగా ఇలా వచ్చే బాలయ్య అలా వెళ్లిపోతున్నారని కూడా ఆమె విమర్శించారు.
హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి ఎలా ఉందని శ్యామల పట్టణ ప్రజలను ప్రశ్నించారు. కేవలం ఓ శిలాఫలకం వేసి.. దానిని ఫొటోలు వేయించుకుని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, అయితే కళాశాల ఏర్పాటు మాత్రం ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగానే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్న బాలయ్య లాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on June 20, 2025 4:30 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…