వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, స్థాని పోలీసుల వేధింపుల కారణంగా రెంటపాళ్ల ఉప సర్పంచ్, వైసీపీ నేత నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్… పోలీసు ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా జగన్ పరామర్శలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
జగన్ గతంలో చేపట్టిన పర్యటనలను దృష్టిలో పెట్టుకుని పల్నాడు జిల్లా పోలీసులు రెంటపాళ్లలో జగన్ పర్యటనకు అనుమతే ఇవ్వలేదు. అయితే పదేపదే వినతులు రావడంతో ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. జగన్ ఎస్కార్ట్ వాహనాలకు అదనంగా ఓ మూడు వాహనాలు, వంద మందితో జగన్ రెంటపాళ్లలో పర్యటించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే పోలీసుల ఆంక్షలు జగన్ టూర్ లో ఉక్కడా కనిపించలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరిన జగన్ రెంటపాళ్ల చేరుకునేందుకు ఏకంగా సాయంత్రం 5 గంటలు అయ్యంది. అంటే ఏకంగా జగన్ రెంటపాళ్ల చేరుకునేందుకే 7 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో గుంటూరు దాటిన తర్వాత ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్ వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో సింగయ్య అనే వృద్ధుడిని ఆ కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. ఈయన వైసీపీ కార్యకర్తగానే చెబుతున్నారు.
ఇక ఆ తర్వాత జగన్ సత్తెనపల్లి చేరుకోగానే… పట్టణంలోని గడియారం స్తంభం అశేష జనవాహిని కనిపించింది. ఫలితంగా భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా… అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపును నడుపుకుంటూ ఆయన జీనవం సాగిస్తున్నట్లు సమాచారం. వెరసి ఆత్మహత్య చేసుకున్న పార్టీ నేత ఫ్యామిలీ పరామర్శకు అని వెళ్లిన జగన్ వల్ల పార్టీకే చెందిన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.
This post was last modified on June 18, 2025 7:04 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…