భాగ్య నగరి హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతోంది. నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ అడుగులు… ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని ఐటీ దిగ్గజాల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా భాగ్యనగరిలో మంగళవారం గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఓపెన్ అయిపోయింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించారు.
ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు అయిన జీఎస్ఈసీ కి ఓ ప్రత్యేకత ఉంది. గూగుల్ ఈ తరహాలో జీఎస్ఈసీ లు ప్రపంచంలో మరికొన్ని చోట్ల ఉండవచ్చు గానీ…ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో మాత్రం హైదరాబాద్ సెంటరే మొదటిది. ఇప్పటికే గూగుల్ తన విస్తరణకు హైదరాబాద్ ను కీలక స్థావరంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో ఏ కొత్త కేంద్రాన్ని ప్రారంభించాలన్నా… గూగుల్ తన తొలి ప్రాధాన్యాన్ని హైదరాబాద్ కే ఇస్తోంది.
1990 దశకంలో ఐటీలో అప్పుడప్పుడు బుడిబుడి అడుగులు ప్రారంభించిన హైదరాబాద్ కు గూగుల్, మైక్రోసాఫ్ట్ చాలా కంపెనీలు చంద్రబాబు కృషితో క్యూ కట్టాయి. అప్పటిదాకా కొండలు, గుట్లతో కూడిన సైబరాబాద్ ఈ ఐటీ కంపెనీల రాకతో సర్వాంగ సుందరమైన నగరంగా ఆవిర్భవించింది. ఐటీ రంగంలో విదేశీ సంస్థలే హైదరాబాద్ కు క్యూ కడుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజాలు కూడా హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాాజాగా ఇప్పుడు జీఎస్ఈసీ హైదరాబాద్ లో ఏర్పాటు కావడంతో నగరానికి మరింత ప్రాధాన్యం దక్కిందని చెప్పక తప్పదు.
This post was last modified on June 18, 2025 2:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…