Political News

సింప‌తీ కోసం కేటీఆర్ జైలు పాట‌: నెటిజ‌న్ల ట్రోల్స్‌

తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. తాజాగా జైలు-జైలు అంటూ పాట పాడిన విష‌యం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ – రేస్ వ్య‌వ‌హారంపై ఆయ‌న‌ను విచార‌ణ‌కు పిలిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని.. జైలుకు వెళ్లినా ఇబ్బంది లేద‌న్నారు. అయితే.. ఆయ‌న‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయ‌లేదు. విచార‌ణ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌దిలేశారు. అయితే.. ఆ త‌ర్వాత ‌కూడా కేటీఆర్ మరోసారి జైలు జీవితంపై మాట్లాడారు. త‌నను జైల్లో పెడితే ప్ర‌శాంతంగా విశ్రాంతి తీసుకుంటాన‌ని అన్నారు.

ఇక‌, ఈ కామెంట్ల‌పై మంత్రి సీత‌క్క కూడా స్పందించారు. కేటీఆర్‌కు జైలుకు వెళ్లాల‌ని ఉబ‌లాట ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. సింప‌తీ కోసం కేసీఆర్ ప్యామిలీ ఇప్పుడు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. దీనిలో భాగంగానే కేటీఆర్ జైలు.. జైలు.. అం టూ పాట‌లు పాడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో క‌విత జైలుకు వెళ్లినా.. పార్టీకి సింప‌తీ రాలేద‌ని గుర్తు చేశారు. అప్ప‌ట్లో కూడా క‌విత అరెస్టును చూపించి ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. కానీ, ప్ర‌జ‌లు ఈ నాట‌కాల‌ను గ‌మ‌నించార‌ని మంత్రి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు అంత మోజుగా ఉన్నా.. ప్ర‌భుత్వానికి అలాంటి తీరిక లేద‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డ‌మే ప్ర‌భుత్వ ప‌ని అని పేర్కొన్నారు.

ఇక‌, నెటిజ‌న్లు కూడా కేటీఆర్ చేసిన జైలు వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. కేటీఆర్ జైలుకు వెళ్తే.. పార్టీ గ్రాఫ్ పెరుగుతుంద‌ని ఒక‌రు వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను జైల్లో పేట్టే సాహ‌సం సీఎం రేవంత్ రెడ్డి చేయ‌బోర‌ని ఒక‌రు వ్యాఖ్యానించారు. మ‌రికొందరు జైలుకు వెళ్తే.. బీఆర్ఎస్‌ను న‌డిపించేవారు ఎవ‌రు? అంటూ కామెంట్లు చేశారు. క‌విత అప్పుడు పార్టీ ప‌గ్గాలు తీసుకునే చాన్స్ ఉంటుంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా త‌మ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. తాజా విచార‌ణ‌లో ఏసీబీ కేటీఆర్‌ను 8 గంట‌ల‌పాటు విచారించింది. అనంత‌రం ఆయ‌న‌ను వ‌దిలేసింది.

కాగా.. తాజా విచార‌ణ‌లో కేటీఆర్‌ను గ‌తంలో వాడిన మొబైల్ ఫోన్ల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని అధికారులు ఆదేశించారు. దీనికి రెండు రోజుల స‌మ‌యం ఇచ్చారు. తొలుత మీవెంట సెల్ ఫోన్ తీసుకువ‌చ్చారా? అని అధికారులు ప్ర‌శ్నించారు. తీసుకువ‌స్తే.. త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరారు. కారు డ్రైవ‌ర్ వ‌ద్ద ఉంచారా? అని కూడా ప్ర‌శ్నించారు. అయితే.. తాను అసలు ఫోన్ తీసుకురాలేద‌ని కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 18లోగా ఫోన్ల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని అధికారులు ఆదేశించారు.

This post was last modified on June 16, 2025 9:30 pm

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

17 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

24 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

3 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago