ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును అధికారులు ఏకంగా 9 గంటల పాటు విచారించారు. ఉదయం 10.30 గంటల సమయంలో మొదలైన ఈ విచారణ సుదీర్ఘంగా సాగగా… కేటీఆర్ ను ముగ్గురు అదికారులతో కూడిన విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్… అసలు ఏసీబీ వద్ద ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారమే లేదని తేల్చి పారేశారు. అంతేకాకుండా తాను అడిగిన ప్రశ్నలకు ఏసీబీ అధికారులే నోరు వెళ్లబెట్టారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదివరకే ఓ దఫా ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత గతవారం ఏసీబీ నోటీసులు ఇవ్వగా… సోమవారం ఉదయమే నిర్దేశిత సమయానికే కేటీఆర్ బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తన లాయర్ రామచంద్రరావును వెంట రాగా కేటీఆర్ విచారణకు వెళ్లగా…ఏసీబీ అధికారులు ఆయనను దాదాపుగా 60 ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం. ఈ ప్రశ్నల్లో చాలా వాటికి సూటిగానే సమాధానాలు ఇచ్చిన కేటీఆర్ కొన్ని ప్రశ్నలకు మాత్రం తనదైన శైలి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏసీబీ సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
హైదరాబాద్ ఇమేజీని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేందుకే తాము ఫార్ములా ఈ కారు రేసులను నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. విచారణ అనంతరం పార్టీ నేతలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్టాడారు. 9 గంటల విచారణలో ఏసీబీ అధికారులు ఒకే ప్రశ్నను అటు తిప్పి, ఇటు తిప్పి అడిగారే తప్పించి… కొత్తగా అడిగిందేమీ లేదని ఆయన ఆరోపించారు. అసలు ఏమీ లేని కేసులో ఏదో ఉందన్నట్లు నిరూపించేందుకు ఏసీబీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తాము ఫార్ములా ఈ కారు రేసుల సంస్థకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన వెల్లడించారు. తాము ఇచ్చిన డబ్బు ఆ సంస్థ బ్యాంకు ఖాతాలోనే ఉందని కూడా ఆయన అన్నారు.
నాటి తమ ప్రభుత్వం పంపిన డబ్బు ఫార్ములా సంస్థకు చేరిందన్న విషయం విస్పష్టంగా తెలుస్తూ ఉంటే..ఇక అవినీతి ఎక్కడ జరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు అవినీతే జరగని ఈ వ్యవహారంలో రాజకీయ కక్షపూరితంగా ఇబ్బందులు పెట్టేందుకే రేవంత్ సర్కారు తమను ఇబ్బందులు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఫార్ములా కంపెనీకీ డబ్బు ఇచ్చిన మాట నిజమేనని తాము అంటూ ఉంటే… కుడి చేతితో ఇచ్చారా? ఎడమ చేతితో ఇచ్చారా? అని ప్రశ్నించడమేమిటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంతకుముందు చెప్పినట్టే ఇదో లొట్టపీసు కేసు అని, రేవంత్ ఓ లొట్టపీసు సీఎం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on June 16, 2025 8:44 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…