Political News

కొడాలి నాని అరెస్టుపై పేర్ని నాని జోస్యం

2019-24 మధ్య వైసీసీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెచ్చిపోయి వ్యవహరించిన నాయకులు, అధికారులను గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. ఒక పద్ధతి ప్రకారం వారి మీద కేసులు పెడుతూ.. వారికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా చాలామంది వైసీపీ నేతలు చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఐతే ఇప్పటికే చాలామంది నాయకులను టార్గెట్ చేసినప్పటికీ.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని జోలికి మాత్రం కూటమి ప్రభుత్వం వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఈ విషయంలో రగిలిపోతున్నారు. అధికారంలో ఉండగా నాని ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడో, ఎంత హద్దులు దాటి ప్రవర్తించాడో అందరికీ తెలిసిందే. కేసులకు దొరికేలా నాని ఎన్నో తప్పులు చేశాడని.. అయినా అతణ్ని ఎలా వదిలేస్తున్నారని కార్యకర్తలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఐతే తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని.. సమయం వచ్చినపుడు అన్నీ వాటంతట అవే జరిగిపోతాయని మంత్రి నారా లోకేష్ సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి లక్ష్యంగా మారిన మాజీ మంత్రి పేర్ని నాని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని అరెస్ట్ విషయంలో ఆయన జోస్యం చెప్పారు.

తనకున్న అంచనా ప్రకారం ఇంకో ఆరు నెలల్లో కొడాలి నాని అరెస్ట్ అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ఆలోచన, రెడ్ బుక్ లెక్కల ప్రకారం.. కొడాలి నాని అరెస్ట్ కోసం ఇంకొంత కాలం ఆగుతారన్నారు. ప్రస్తుతం నాని ఆరోగ్యం బాగా లేదని.. హార్ట్ సర్జరీ జరిగిందని.. ఒకవేళ అరెస్ట్ చేసినా అనారోగ్య కారణాలు చూపించి సులువుగా బెయిల్ తీసుకుంటారని పేర్ని నాని అన్నారు. అందుకే నాని ఆరోగ్యం మెరుగుపడి, జిమ్ అదీ చేసి బలంగా తయారైతే.. అప్పుడు సమయం చూసి ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని.. ఇందుకు ఆరు నెలల టైం పట్టొచ్చని.. అరెస్ట్ తర్వాత సులువుగా బయటికి రాకుండా చూసేందుకే టైం తీసుకుంటున్నారని ఆయన విశ్లేషించడం విశేషం.

This post was last modified on June 16, 2025 3:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago