గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చద్రబాబు గురువారం నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజా శుక్రవారం నుంచి లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద 52 వేల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో వేసింది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ.. సదరు కుటుంబం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గతంలో వైసీపీ హయాంలో తమకు ఒక్క చిన్నారికి మాత్రమే అమ్మ ఒడి పడిందని.. ఇప్పుడు నలుగురికి తల్లికి వందనం అందిందని ఆ కుటుంబం పేర్కొంది. చెప్పిన మాటకు కట్టుబడి చంద్రబాబు చేసిన సాయంతో తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటామన్నారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. దాదాపు 32 లక్షల మందికి శుక్రవారం ఈ సొమ్ములు వారి వారి ఖాతాల్లో పడ్డాయి. మరికొందరికి వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో ఆ సొమ్ములతో తమ చిన్నారులకు పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, “తల్లికి వందనం” కింద చంద్రన్న రూ.52 వేలు పంపించాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేసారు. మా కుటుంబానికి ఒక్కసారిగా రూ.52 వేలు వచ్చాయి.” అని తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 13, 2025 2:12 pm
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…