#Boycottamazon.. నిన్నట్నుంచి ఇండియాలో ఈ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అలాగే ఐపీఎల్ ఫైనల్ జరిగింది. అంత సందడిలోనూ అమేజాన్‌ను బాయ్‌కాట్ చేయాలనే పిలుపునిస్తూ వేసిన హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవడం విశేషం. ఇండియా అవతల కూడా ఈ హ్యాష్ ట్యాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. దీన్ని ట్రెండ్ చేసింది ఇండియన్సే. మరి మన వాళ్లను అమేజాన్ అంతగా ఏం హర్ట్ చేసింది?
హిందువుల ఎంతో పవిత్రంగా భావించే ‘ఓం’ సింబల్‌ను ముద్రించిన డోర్ మ్యాట్లను విదేశాల్లో అమేజాన్ అమ్ముతుండటమే ఇందుక్కారణం. మన హిందూ దేవతల చిత్రాలను చెప్పుల మీద, డోర్ మ్యాట్ల మీద ముద్రించి అమ్మడం కొన్ని దేశాల్లో ఫ్యాషన్. ఇలా అనేక సార్లు భారతీయుల మనోభావాలను దెబ్బ తీశారు. చైనా వాళ్లు తరచుగా ఇలాంటి పనులు చేస్తుంటారు కూడా. ఐతే ఇండియాలో పెద్ద మార్కెట్ ఉన్న అమేజాన్.. భారతీయుల మనోభావాల గురించి పట్టించుకోకుండా ఇలాంటి అమ్మకాలు చేయడంతో మనవాళ్లకు మండిపోయింది.
దీంతో బాయ్‌కాట్ అమేజాన్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలుపెట్టారు. అమేజాన్ యాప్‌ను డెలీట్ చేస్తున్నట్లు ఫొటోలు పెట్టి ఇకపై ఎప్పుడూ అందులో ఏ వస్తువూ ఆర్డర్ చేయబోమంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తక్షణం అమేజాన్ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు అమేజాన్ భారతీయుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరించిన ఉదంతాలను కూడా గుర్తు చేస్తున్నారు. విషయం పెద్దదవుతుండటంతో అమేజాన్ ఓం ముద్ర ఉన్న డోర్ మ్యాట్లను వెబ్ సైట్ నుంచి తొలగించింది.
This post was last modified on November 11, 2020 2:36 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…