Political News

ముహూర్తం ఫిక్స్‌.. చంద్ర‌బాబుతో సినీ ఇండ‌స్ట్రీ మీటింగ్‌!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు.. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశానికి సిద్ధ‌మయ్యారు. దీనికి సంబంధించిన ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీకి ముహూర్తం నిర్ణ‌యించారు. సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, న‌టులు, దిగ్గ‌జ ర‌చ‌యితలు కూడాసీఎం చంద్ర‌బాబును క‌లుసుకోనున్నారు.

ఈ భేటీకి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రానున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ద‌గ్గుబాటి సురేష్‌, కె. రాఘ‌వేంద్ర‌రావు, అల్లు అర‌వింద్ స‌హా.. సీనియ‌ర్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు.. అశ్వినీద‌త్ వంటి వారు కూడా హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, తాజా పరిణామాలపై వారంతా ముఖ్య‌మంత్రితో చ‌ర్చించ‌నున్నారు. కాగా.. ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌… సినీ ఇండ‌స్ట్రీపై నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే.

లేఖ‌తో..

తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త నెల‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండ‌స్ట్రీకి ఏమాత్రం కృతజ్ఞ‌త లేద‌న్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 11 మాసాలు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబును క‌లుసుకునేందుకు ఒక్క‌రు కూడా రాలేదు. క‌నీసం అభినందించ‌నూ లేదు. ఇక‌పై న‌న్ను ఎవ‌రూ వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకోవ‌ద్దు! అని ప‌వ‌న్ కల్యాణ్ లేఖ సంధించారు. కూట‌మి ప్ర‌భుత్వాన్ని ముందుండి న‌డిపిస్తున్న సీఎం చంద్ర‌బాబును క‌నీసం మ‌ర్యాద పూర్వ‌కంగా అయినా.. సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ప‌ల‌కరించారా? అని నిల‌దీశారు.

ఇదేస‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రిని ఎలా వేధించారో.. ప‌వ‌న్ గుర్తు చేశారు. హీరోల‌ను విల‌న్‌ల మాదిరిగా ట్రీట్ చేశార‌ని వ్యాఖ్యానించారు. అనంత‌రం.. సినీ ఇండ‌స్ట్రీలో పెను కుదుపు ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ముఖ్య‌మంత్రితో భేటీ కి ఇండ‌స్ట్రీ పెద్ద‌లు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

This post was last modified on June 12, 2025 8:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

3 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

25 minutes ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

4 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

6 hours ago