తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట తన కేబినెట్‌ను విస్తరించిన విషయం తెలిసిందే. అనేక తర్జన భర్జనలు సహా.. అనేక మందిని సంప్రదించి, అధిష్టానంతో చర్చించిన తర్వాత.. ముగ్గురంటే ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో నూ ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. వాస్తవానికి ఐదు నుంచి ఆరుగురికి అవకాశం ఉన్నా.. కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఇక, వీరికి తాజాగా శాఖలు కేటాయించారు. పైకి దీనిపై అధిష్టానంతో చర్చించలేదని చెబుతున్నా.. తాజాగా వెల్లడించిన శాఖలను బట్టి.. అధిష్టానం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక, తాజాగా మంత్రివర్గంలోకి వచ్చిన వారిలో గడ్డం వివేక్( చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం), వాకాటి శ్రీహరి(మక్తల్ ఎమ్మెల్యే ), అడ్లూరి లక్ష్మణ్(ధర్మపురి ఎమ్మెల్యే)లకు అవకాశం ఇచ్చారు. ఇక, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వీరికి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ – కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు, వాకిటి శ్రీహరి – పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ – ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. కానీ.. అందరూ ఆశించినట్టుగా.. కీలకమైన హోం శాఖను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎవరికీ కేటాయించకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు సీఎం వద్దే.. సుమారు 7 శాఖల వరకు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది హోం శాఖ. దీనిని అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ కోటాలో ఆశించినట్టు వార్తలు వచ్చాయి.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే.. తాజాగా ఇచ్చిన కేటాయింపులను చూస్తే.. దీనిపై పార్టీ అధిష్టానం స్పష్టమైన ముద్ర కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గడ్డం వివేక్‌కు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలను కేటాయించారు. వీటిలో కీలకమైంది కేవలం కార్మిక శాఖ మాత్రమే. ఇక, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు ఇచ్చారు. వీటిలోనూ కమర్షియల్ టాక్స్ కీలకం.
అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. కానీ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. శాంతి భద్రతలు.. రాబోయే రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. శాంతి భద్రతలను సీఎం రేవంత్ దగ్గరే ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తానికి కీలకమైన శాఖను మాత్రం రేవంత్ తనదగ్గరే పెట్టుకున్నారన్న వాదనవినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 11, 2025 9:11 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…