ఏపీ కాంగ్రెస్ పరిస్థితి చిత్రంగా మారుతోంది. ఘర్ వాపసీ నినాదంతో పార్టీలో ఉత్తేజాన్ని నింపాలని భావిస్తు న్న నేతలకు ఆ పరిస్థితి లేకపోగా.. ఉన్నవారుసైతం పార్టీని వదిలిపోయే పరిస్థితి వస్తోందనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా అనంతపురం జిల్లాకు చెందిన నాయకులే ఉన్నారు. అయితే.. అనంతపురంలోనే పార్టీ వీక్‌గా మారడం.. కీలకమైన కృష్ణాజిల్లాలోనూ పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు.. ఇప్పటికే వెళ్లిపోగా.. మరింత మంది పక్క చూపులు చూస్తుండడం పార్టీ పరిస్థితిపై మేఘాలు అలుముకున్న చందంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
విభజనకు బలమైన జిల్లాలుగా ఉన్న గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. సరే! విభజనను వ్యతిరేకించిన నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు సైతం పార్టీకి రాం రాం చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. వెళ్లిపోయిన వారితోనే పార్టీ ఆగిపోతుందా? అంటే.. కాదనే అంటున్నారు గత అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రఘువీరా పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. సాకే బాధ్యతలు చేపట్టారు. అయితే.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సాకే విఫలమవుతున్నారని ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నవారు చెబుతున్నారు.
పైగా.. కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు.. విమర్శలు చేస్తున్నా.. సాకే సరైన రీతిలో స్పందించడం లేదని కూడా అంటున్నారు. ఇదే ఇప్పుడు పార్టీలో చీలికలు తెస్తోంది. అమరావతి ఉద్యమంలో కాంగ్రెస్‌కు చెందిన ఓ సామాజిక వర్గం నాయకులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అయితే, వీరిపై ఇటీవల బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. 50 వేల ఖరీదు చేసే చీరలు కట్టుకుని రోడ్ల మీదకు వస్తున్నారంటూ.. వ్యాఖ్యలు చేశారు. అయితే, వీరికి సరైన విధంగా కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ సాకే విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన సదరు మహిళా నాయకురాలు.. ఏకంగా పార్టీకి దూరంగా ఉంటోంది. అనంతపురంలోనూ ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి.
చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలను పార్టీ మారేలా చేస్తున్నారు. మరికొందరు పార్టీ ఇక పుంజుకోదనే వ్యవహారంతో రావాలని అనుకున్నా.. ఉన్నా.. మౌనంగా ఉంటున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి వంటివారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. పోనీ.. పార్టీ ఇక, ఉండదా.? అంటే.. నాయకులు నెలకొసారి సమావేశమై పార్టీని పుంజుకునేలా చేస్తామంటూ.. మాట్లాడుతున్నారు. కానీ.. ఇది ఎప్పటికి పుంజుకుంటుందో.. ఎలా పుంజుకుంటుందో మాత్రం చెప్పడం లేదు. దీంతో ఉన్నవారు పోతున్నారు.. ఇప్పటికే పోయిన వారు మాత్రం తిరిగి కూడా చూడడం లేదు. ఇదీ ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 11, 2020 8:28 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…