Political News

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డికి భారీ ఊర‌ట‌.. జైలు శిక్షపై స్టే!

ఓబులాపురం మైనింగ్ వ్య‌వ‌హారంలో అక్ర‌మాలు చేసి.. జైలుకు కూడా వెళ్లిన క‌ర్ణాట‌క వ్యాపార వేత్త‌., ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్ష‌పై హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించిన‌ట్ట‌యింది. ప్ర‌స్తుతం గాలి జ‌నార్ద‌న్ రెడ్డి చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. 2009-10 మ‌ధ్య క‌ర్ణాట‌క‌-అనంత‌పురం మ‌ధ్య ఉన్న ఓబులాపురం గ‌నులను అనుమ‌తికి మించి దోచుకున్నార‌న్న కేసులో గ‌త‌ మేలో సీబీఐ కోర్టు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి స‌హా.. ఆయ‌న బావ‌.. ఐఆర్ ఎస్ అధికారి బీవీ శ్రీనివాస‌రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డి, అలీఖాన్‌ల‌కు ఏడేళ్ల‌పాటు జైలు శిక్ష విధించింది.

దీంతో పోలీసులు.. చంచ‌ల గూడ జైలుకు త‌ర‌లించారు. అయితే.. ఇంత‌లోనే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి స‌హా.. మిగిలిన వారు.. తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. జైలు జీవితం గ‌డ‌ప‌లేక పోతున్నామ‌ని.. వ‌య‌సు రీత్యా అయినా.. త‌మ‌ను కరుణించాల‌ని వారు వేడుకున్నారు. ఈ పిటిష‌న్‌లో గాలి స‌హా .. మిగిలిన దోషులు ప‌లు కీల‌క విష‌యాల‌తో కోర్టును అభ్య‌ర్థించారు. వ‌య‌సు, త‌మ వ్యాపారాలు, కుటుంబాలు స‌హా.. ఆరోగ్య అంశాల‌ను ప్ర‌స్తావించారు.

“వ‌య‌సు రీత్యా వ‌చ్చిన బీపీ, షుగ‌ర్‌తో ఇబ్బంది ప‌డుతున్నాను. నాపై చేసిన అభియోగాల‌కు ఆధారాలు లేవు. గ‌తంలో విచారించిన‌ప్పుడు కూడా.. ఎలాంటి ఆధారాల‌ను ప్ర‌వేశ పెట్ట‌లేదు. అందుకే గ‌తంలో బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చారు క‌దా.. అని నేనేమీ త‌ప్పు చేయ‌లేదు. కోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించ‌లేదు. ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేయండి. ఎలాంటి నిబంధ‌న‌లు విధించినా.. క‌ట్టుబ‌డి ఉంటాం“ అని గాలి త‌ర‌పున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు.

అయితే.. గాలి, ఇత‌ర దోషుల‌కు బెయిల్ ఇవ్వరాద‌ని.. వారు చేసిన నేరాలు రుజువ‌య్యాయ‌ని సీబీఐ త‌ర ఫున న్యాయ‌వాదులు తెలిపారు. ఈ క్ర‌మంలో తెలంగాణ హైకోర్టు తాజాగా శిక్ష‌ను నిలిపి వేస్తూ.. తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి కొన్ని ష‌ర‌తులు కూడా విధించింది. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున పూచీక‌త్తులు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. అదేవిధంగా పాస్ పోర్టుల‌ను పోలీసుల‌కు స్వాధీనం చేయాల‌ని పేర్కొంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ దేశం విడిచి వెళ్ల‌రాద‌ని, ష‌ర‌తుల‌ను ఉల్లంఘించ‌డానికి వీల్లేద‌ని తెలిపింది.  

This post was last modified on June 11, 2025 11:40 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

42 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago