ఏపీలో 2019-24 మధ్య సాగిన వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఎంపిక ఏ రీతిన సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షిలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులకు ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఇంకా లోతుగా వెళితే చాలానే ఉంది గానీ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సలహాదారులుగా ఎంపిక చేస్తున్న వారి అర్హతలు, వారి పూర్వానుభవం, వారి రంగాల్లో వారు సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే… చాంతాడంత అవుతుంది. అలాంటి ఎంపికల్లో డీఆర్డీఓ చైర్మన్ గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఏపీ వాసి సతీష్ రెడ్డికి ఇటీవలే బాబు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎంపిక చేశారు.
సరే… సతీష్ రెడ్డి గురించి చెప్పాలంటే నిజంగానే చాంతాడంత ఉంటుంది. రక్షణ రంగంలో ఆయన విశేష కృషి చేశారు. ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన కొంతకాలానికి సతీష్ రెడ్డి, ఇస్రో చైర్మన్ గా పనిచేసిన తన మిత్రుడిని తీసుకుని బాబును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఏపీ అబివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరగగా… ఆ బాధ్యతలేవో మీరే తీసుకోవచ్చు కదా అంటూ బాబు సతీష్ రెడ్డికి ఆఫర్ చేశారు. సతీష్ రెడ్డీ ఒప్పుకున్నారు. ఇంకేముంది ఏపీ శాస్త్ర, సాంకేతిక రంగాల సలహాదారుగా సతీష్ రెడ్డి నియమితులయ్యారు.
తాజాగా ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతా సలహా మండలి (ఎన్ఎస్ఏబీ)ని ఏర్పాటు చేసింది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ అలోక్ జోషి అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ సంస్థలో సతీష్ రెడ్డిని ఓ సభ్యుడిగా ఎంపిక చేస్తూ మోదీ సర్కారు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో సతీష్ రెడ్డి రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. ఆ తర్వాత కూడా ఆయన అందులో కొనసాగే అవకాశం ఉందని చెప్పక తప్పదు. పహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకే ఈ సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది.
ఇప్పటికే జాతీయ స్థాయిలో రక్షణ శాఖ వంటి కీలక శాఖల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేయడమే కాకుండా… ఇప్పటికీ దేశ భద్రతపై ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్న సతీష్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిన చంద్రబాబు ఆయనను గౌరవించడంతో పాటుగా ఆయన సేవలను ఏపీ అభివృద్ది కోసం వినియోగించుకోవాలని భావించారు. అయితే సతీష్ రెడ్డి లాంటి సమర్థుడి సేవలు ఇప్పుడు దేశానికి అవసరం అయ్యాయి. నిజంగానే ఓ ప్రభుత్వ సలహాదారు అయినా, ఓ కీలక పదవిలో నియమించే నేత అయినా, ఓ కీలక బాధ్యతను భుజానికెత్తుకునే నేత అయినా చంద్రబాబు అన్ని రకాలుగా ఆలోచించి అత్యుత్తమ ఎంపికలే చేస్తారు. ఆ మాట నిజమని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితం కాగా… ఇప్పుడు సతీష్ రెడ్డి రూపంలో మరోమారు రుజువు అయ్యింది.
This post was last modified on June 10, 2025 10:46 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…