Political News

రాష్ట్రాలకు కేంద్రం ‘వ్యాక్సిన్’ సంకేతం

ఆ దేశంలో వ్యాక్సిన్ రెడీ.. ఈ దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు.. ఫలానా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌తో సత్ఫలితాలు.. అని వార్తల గురించి మాట్లాడుకోవడానికే సరిపోతోంది. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి.. ప్రభుత్వం చేతికి వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయి.. జనాలకు వాటిని ఎప్పుడు వేస్తారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఆగస్టు 15కే వ్యాక్సిన్ అంటూ ఊరించిన నేతలు, ఫార్మా కంపెనీల ప్రతినిధుల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. ఏడాది చివరికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు ఈ విషయమై కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటి నుంచి మరో వంద రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని.. కాబట్టి టీకా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సంకేతాలు ఇచ్చింది.

తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్.. హర్షవర్ధన్‌ను ప్రశ్నించారు. అందుకాయన.. ‘అతి త్వరలోనే వస్తుంది. మీరంతా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉండాలి’ అని బదులిచ్చారు. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ఆరంభంలో రాష్ట్రాల వద్దకు కరోనా వ్యాక్సిన్‌ను చేర్చే ప్రయత్నం చేస్తామని హర్షవర్ధన్ సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.

టీకా వివరాలు, దాన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం, ముందుగా ఎవరెవరికి వ్యాక్సిన్ వేయాలనే విషయమై ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల అధికారులు కేంద్రంతో సమన్వయం చేసుుకంటూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హర్షవర్ధన్ గతంలో అన్నట్లు మార్చిలో ఎంపిక చేసిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ ఇచ్చే అవకాశముంది. సామాన్య జనానికి ఇంకో రెండు మూడు నెలల తర్వాత వ్యాక్సినేషన్ చేయించే అవకాశముంది.

This post was last modified on November 10, 2020 10:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

14 mins ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

6 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

9 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

10 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

10 hours ago