టీడీపీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే జూలై 1 నుంచి గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంబించనుంది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను ఇప్పటికే రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పూర్తయిన నేపథ్యంలో పాల నా పరంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక అంశాలను ప్రజలకు వివరించను న్నారు. ప్రజల పరంగా పార్టీ హవా తగ్గకూడదన్న వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ పార్టీని ప్రజలకు కనెక్షన్ కలిపి ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు.
ఏంటి లక్ష్యం..?
పాలనపరంగా ఏడాది పూర్తయినప్పటికీ.. పార్టీ అధినేత చంద్రబాబు ఆశిస్తున్న స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వంపై రియాక్షన్ ఉండడం లేదు. నిజానికి చంద్రబాబు ఇప్పటికేచేయించిన సర్వేల్లో 80 శాతం సంతృప్తి ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులకు అంతే మొత్తంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉందన్న విషయం తరచుగా చర్చకు వస్తోంది. దీనివల్ల పై స్థాయిలో ఎంత చేసినా.. రేపుఎన్నికల సమయానికి ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల వరకు వేచి చూడకుండా.. ఇప్పటి నుంచి మురికి కడుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే సంక్షేమ పథకాలపై అసంతృప్తి ఉన్నవారిని, పథకాలు అందని వారిని కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు-ప్రజల మధ్య గ్యాప్ పెరుగుతున్నదన్న సంకేతాలు బలంగా వస్తున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌ను సాధ్యమైనంత త్వరగా తగ్గించేందుకు కూడా ప్రభుత్వం పరంగా పార్టీ ఈ చర్యలకు నడుంబిగింది. వాస్తవానికి క్షేత్రస్థా యిలో చంద్రబాబుకు ఉన్న పేరు గ్రాఫ్ పరంగా చూసుకుంటే పెరిగింది. కానీ, ఎన్నికల విషయానికి వస్తే.. చంద్రబాబును చూసి వేసే వారికంటే.. కూడా నాయకులను చూసి ఓటేసేవారు పెరుగుతారన్న అంచనా ఉంది.
ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను యాక్టివ్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గడపగడపకు కార్యక్రమాన్ని విజయంవంతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గడపగడపకు తిరిగే నాయకులు.. కేవలం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే కాకుండా.. తమ నియోజకవర్గం పరిధిలో ఏడాది కాలంలో చేసిన ప్రగతిని కూడా వివరించాలనేది ప్రధాన కాన్సెప్టు. అదేవిధంగా ప్రజలతో తమకు ఉన్న సంబంధాలను మెరుగు పరిచేందుకు కూడా దీనిని వినియోగించుకోనున్నారు. మొత్తంగా జూలై 1 నుంచి రాష్ట్రంలో కొత్త మార్పు దిశగా టీడీపీ అడుగులు వేయనుందన్నది పార్టీలో చర్చసాగుతోంది.
This post was last modified on June 10, 2025 10:39 am
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…