సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు(కేఎస్ ఆర్) అరెస్టు నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసుల వివరాలను పోలీసులు వెల్లడించారు. అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం..అక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడం వంటివి సాక్షి టీవీలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరైనా.. నాడు యాంకర్‌గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వీటిని అప్పటికప్పుడు ఖండించలేదన్నది ప్రధాన విమర్శ.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి చెందిన తుళ్లూరు మహిళలు.. ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు ఆయనను సోమవారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తనకు కనీసం ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే అరెస్టు చేస్తున్నారని.. కొమ్మినేని వాదించారు. అంతేకాదు.. తనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోరారు. కానీ, కేసు తీవ్రత కావొచ్చు.. మహిళల ఆగ్రహం కావొచ్చు.. ఏదైనా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
తర్వాత.. ఇచ్చిన సమాచారం మేరకు కొమ్మినేనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్, ఈ వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడు కృష్ణంరాజు, ఈ డిబేట్ నిర్వహించిన సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
ఇక, సెక్షన్ల విషయానికి వస్తే.. బీఎన్ ఎస్ ఎస్(భారతీయ న్యాయ సురక్షాసంహిత చట్టం) ప్రకారం 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ సెక్షన్లు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీటి ప్రకారం.. బెయిల్ కూడా దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on June 9, 2025 3:08 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…