Political News

సాక్షి ఎఫెక్ట్‌: టీవీల‌ను శుద్ధి చేసుకుంటున్నారు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఓ రాజ‌కీయ వ్యాఖ్యాత‌, జ‌ర్న‌లిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాక‌ర వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల్లో ఎంత తీవ్రమైన ఆవేద‌న క‌లిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అమ‌రావ‌తిలో ఉన్న‌వారంతా.. ‘ఆ త‌ర‌హా’ మ‌హిళ‌లేన‌ని స‌ద‌రు వ్యాఖ్యాత కామెంట్లు చేయ‌డం.. దానిని పూర్తిగా ఖండించ‌కుండా.. యాంక‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డంపై ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు.

నిజానికి నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు.. ఇది టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని అనుకు న్నారు. కానీ, ఇప్పుడు జ‌న సామాన్యానికి కూడా ఈ వ్య‌వ‌హారం అర్ధ‌మైంది. దీంతో ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతు న్నారు. పైకి ఎలా ఉన్నా.. వారు చేస్తున్న చేత‌లు చూస్తే.. వైసీపీని,.. సాక్షి మీడియాను ఎంత‌గా తిట్టి పోస్తున్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. తాజాగా ఓ మ‌హిళ త‌న టీవీని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి.. నీటితో క‌డ‌గ‌డ‌మే కాకుండా.. ఒక‌టికి రెండు సార్లు లిక్విడ్ వేసి మ‌రీ శుభ్రం చేయ‌డం.. శుద్ధి చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇది మ‌హిళ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని.. విష‌య తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. చాలా సీరియ‌స్‌గానే ప్ర‌జ‌లు చ‌ర్చిస్తున్నారు. దీనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.లేక‌పోతే.. వేల‌కు వేలు పోసి కొనుగోలుచేసుకున్న టీవీల‌కు దిష్టి తీయ‌డం.. నీటితో శుద్ధి చేసుకోవ‌డం.. లిక్విడ్ వేసు క‌డుక్కోవ‌డం అంటే.. మాటలా?! ప్ర‌త్య‌ర్థి ప‌క్షం ఔన‌న్నా కాద‌న్నా.. రాష్ట్ర ప్ర‌జ‌లు అమ‌రావ‌తిని కోరుకుంటున్నారు. అలాంటి ప్రాంతంపై వేరే రూపంలో వెగ‌టు పుట్టించేలా చేయాల‌న్న వైసీపీ ప్ర‌య‌త్నాలను కూడా వారు “క‌డిగేస్తున్నార‌నే” వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on June 9, 2025 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

3 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

3 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

4 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

6 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

7 hours ago