ఏపీ టెక్ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండగా.. తాజాగా ఏకంగా రాజధాని అమరావతిలోనే ఓ మెగా క్యాంపస్ ఏర్పాటు దిశగా ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సన్నాహాలు చేస్తోంది. అమరావతిలో మెగా క్యాంపస్ కోసం ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. అందులో భాగంగా శుక్రవారం అమరావతి వచ్చిన గూగుల్ ప్రతినిధులు… సీఆర్డీఏ అధికారులతో కలిసి తమకు అనుకూలంగా ఉన్న ఓ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలాన్ని గూగుల్ ఇచ్చేందుకు సీఆర్డీఏ కూడా సుముఖతను వ్యక్తం చేసింది.
అమరావతి పరిధిలోని నెక్కల్లు, అనంతవరం మధ్య.. నెక్కల్లుకు సమీపంలో ఉన్న ఈ-8 రోడ్డుకు ఆనుకుని సర్వే నెంబర్లు 10, 12, 13, 15, 16లలోని 143 ఎకరాలపై గూగుల్ ఆసక్తి చూపింది. ఇదివరకే ఓ థఫా అమరావతిలో పర్యటించిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన గూగుల్ ప్రతినిధులు… తాజా పర్యటనలో తమ మనసులోని మాటను సీఆర్డీఏ అధికారులకు తెలియజేశారు. గూగుల్ లాంటి సంస్థ అమరావతికి వస్తుందంటే ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరచడం ఖాయమే కదా. ఇక టెక్నాలజీ రంగంలో వరల్డ్ దిగ్గజంగా ఉన్న గూగుల్ లాంటి సంస్థ అమరావతికి వస్తోందంటే… ఏపీ ప్రభుత్వం కాదంటుందా? గూగుల్ అడిగిందే తడవుగా ఆ 143 ఎకరాల భూమిని గూగుల్ కు కేటాయించేందుకు సీఆర్డీఏ అక్కడికక్కడే ఓకే చెప్పేసినట్టు సమాచారం.
అయినా ఈ ప్రాంతాన్నే గూగుల్ ప్రతినిధులు ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న విషయానికి వస్తే… అమరావతిలో ప్రతిపాదిస్తున్న ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఏర్పాటు కానున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఈ ప్రాంతం అయితే తమకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుందని గూగుల్ భావించింది. ఈ కారణంగా గూగుల్ ప్రతినిధులు అమరావతి రావడం, సీఆర్డీఏ అధికారులను తీసుకుని వెళ్లి మరీ ఆ స్థలాన్ని చూపించడం జరిగింది. మొత్తంగా గూగుల్ అడిగినట్లుగా స్థలాన్ని ఇచ్చేందుకు సీఆర్డీఏ సమ్మతి తెలపడంతో అతి త్వరలోనే అమరావతిలో గూగుల్ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే… ఓ టెక్నాలజీ సంస్థ తన క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే ఓ ఎకరం స్థలం కూడా సరిపోతుంది. బహుళ అంతస్థుల భవనం ఏర్పాటు చేసుకుని అందులోనే వందలు, వేలాది మందితో ఆయా సంస్థలు తమ క్యాంపస్ లను నడుపుతూ ఉంటాయి. అయితే అమరావతిలో గూగుల్ క్యాంపస్ కోసం ఏకంగా 143 ఎకరాలు కేటాయింపు అనే అంశం వింటేనే… అక్కడ ఏ స్థాయి గూగుల్ ఏర్పాటు కానుందన్న విషయం ఇట్టే తెలిసిపోతోంది. ప్రపంచంలోనే గూగుల్ కు అతి పెద్ద క్యాంపస్ లలో అమరావతి క్యాంపస్ ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. అంతేకాకుండా… గూగుల్ క్యాంపస్ లలోకి అమరావతి క్యాంపస్సే అతి పెద్దదిగా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on June 7, 2025 5:01 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…