Political News

వైసీపీలో గుసగుస‌: ఈ స‌ల‌హాలు ఇస్తోందెవ‌రు ..!

వైసీపీ అధినేతగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై పార్టీలో నాయ‌కుల మ‌ధ్య చిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. “ఈ స‌ల‌హాలు ఇస్తోందెవ‌రు? జ‌గ‌న్‌ను న‌డిపిస్తోందెవ‌రు? “ అని సీనియ‌ర్ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. వాస్త‌వానికి గ‌త వారంలో రెండు కార్య‌క్ర‌మాల‌కు జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. అయితే.. రెండు కార్య‌క్ర‌మాలు కూడా.. పార్టీకి ప్ల‌స్ కాక‌పోగా.. మైన‌స్ అయ్యాయి. పైగా.. వ్య‌తిరేక‌త మ‌రింత పెరిగేలా కూడా చేశాయి. ఈ వ్య‌వ‌హార‌మే పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది.

అంతేకాదు.. అస‌లు ఈ స‌ల‌హాలు ఇస్తోందెవ‌రని కూడా ఆరా తీస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌లకు ముందు కూడా.. ఇలాంటి స‌ల‌హాలే కొంప‌ముంచాయ‌న్న భావ‌న పార్టీ నాయ‌కుల్లో ఉంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పుల నుంచి పార్టీ నుంచి నాయ‌కులు పోయినా.. వారిని క‌నీసం చ‌ర్చించ‌క‌పోవ‌డం.. పార్టీ ప‌రంగా వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌క‌పోవ‌డాన్ని నాయ‌కులు ప్ర‌శ్నించారు.అయినా.. పార్టీలో ఎలాంటి మార్పులూ రాలేదు.

ఇక‌, ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌ధానంగా అసెంబ్లీకి వెళ్ల‌బోమ‌ని భీష్మించ‌డంపై ఎమ్మెల్యేలు కూడా ఆగ్ర‌హంతోనే ఉన్నారు. కానీ. ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు చెప్పుకొనే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇక‌, రౌడీ షీట‌ర్ల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించే కార్య‌క్ర‌మానికి సంబంధించి కూడా.. ఎవ‌రికీ చెప్ప‌కుండానే నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. నాయ‌కులు చెవులుకొరుక్కుంటున్నారు. ఇది స‌రికాద‌ని.. మ‌నం వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత‌మైన విజ‌య‌వాడ‌లో కూడా బాధితుల‌ను ఇప్ప‌టి వ‌రకు ప‌రామ‌ర్శించ‌లేద‌ని.. కొంద‌రు గుర్తు చేస్తున్నారు.

రౌడీషీట‌ర్ల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌కుండా.. నేరుగా న్యాయ‌పోరాటానికి దిగి ఉంటే బాగుండేద‌ని చాలా మంది నాయ‌కులు చెబుతున్నారు. “ఇక్క‌డ వ్య‌క్తులు కాదు.. వ్య‌వ‌స్థ‌ను మేం టార్గెట్ చేసి ఉంటే బాగుండేది“ అని అనంత‌పురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కానీ.. ఈ విష‌యంలో ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో.. అని ఆయ‌న త‌ల‌ప‌ట్టుకున్నారు. ఇక‌, వెన్నుపోటు దినంపైనా.. ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతోంది. ఇక పై అయినా.. అదినేత నిర్ణ‌యం తీసుకునేముందు.. ఒక‌టికి రెండు సార్లు ఆలోచ‌న చేయాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ఇది జ‌రుగుతుందా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

This post was last modified on June 6, 2025 2:57 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YCPYS Jagan

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago