Political News

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని కూట‌మి.. వాట్ నెక్ట్స్ … !

వైసీపీ ఒక‌టి అంటే.. కూట‌మి నాలుగు వాయించేస్తోంది. వైసీపీ నుంచి ఒక్క‌రు బ‌య‌ట‌కు వ‌స్తే.. కూట‌మి పార్టీల నుంచి బ‌ల‌మైన నాయ‌కులు న‌లుగురు వ‌స్తున్నారు. వైసీపీపై విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది ఇదే రాజ‌కీయం. వైసీపీ ఏడాది పాటు మౌనంగా ఉండి.. త‌ర్వాత‌.. చేప‌ట్టిన కార్య‌క్ర‌మం వెన్నుపోటు దినం. అయితే.. దీనికి పోటీగా కూట‌మి కూడా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. పీడ విర‌గ‌డైంద‌ని.. పేర్కొంటూ.. జ‌న‌సేన నాయ‌కులు రోడ్డెక్కారు.

ఇక‌, స‌మ‌తా పాల‌న‌.. సుదినం.. అంటూ.. టీడీపీ నాయ‌కులు వీధులెక్కి కార్య‌క్ర‌మాలు చేశారు. అటు నుంచి ఇద్ద‌రు మాట్లాడితే.. ఇటు నుంచి న‌లుగురుకాదు.. న‌ల‌భై మంది అన్న‌ట్టుగా నాయ‌కులు మైకు పుచ్చుకున్నారు. అంతేకాదు.. వైసీపీ లోపాల‌ను ఎండ‌గ‌ట్టే ప‌త్రిక‌లు, మీడియా కూడా.. భారీగానే విజృంభించింది. అదేస‌మ‌యంలో పాజిటివిటీ కంటే కూడా.. వ్య‌తిరేక‌త‌ను పెంచే వారు కూడా పెరుగుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీకి ఛాన్స్ చిక్క‌డం లేద‌న్న చ‌ర్చ జోరుగానే సాగుతోంది.

ఈ క్ర‌మంలో వైసీపీ ఇప్ప‌టికిప్పుడు చేయాల్సింది ఏంటి? ఎలా ముందుకు సాగాల‌న్న విషయంపై ఆ పార్టీలోనే చ‌ర్చ వ‌స్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం కావ‌డం అలా ఉంచితే.. బ‌ల మైన గ‌ళాల‌ను వెతికి ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఇది ఎప్ప‌టి నుంచో ప‌రిశీల‌కులు చెబుతున్న మాట. అదేస‌మ‌యంలో కౌంట‌ర్ ఎటాక్ చేయ‌గ‌ల సైన్యాన్ని వైసీపీ సిద్ధం చేసుకోవాలి. ఈ విష‌యంలో ఎప్ప‌టి క‌ప్పుడు జ‌గ‌న్ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక‌, ప్ర‌జ‌ల‌కు వైసీపీ వాయిస్ చేరే స‌మ‌యం కంటే ముందే.. కూట‌మి అలెర్ట్ అవుతోంది. ఇది రాజకీయం. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ.. దీనికి త‌గిన విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం నాయ‌కుల‌కు ఉంది. భ‌విష్య‌త్తులో ఒక క్యాలెండ‌ర్ పెట్టుకుంటారో.. నాయ‌కుల‌ను త‌యారు చేసుకుంటారో.. వైసీపీ ఇష్టం. కానీ.. బ‌ల‌మైన వాయిస్ వినిపించేవారు.. దూకుడుగా కౌంట‌ర్లు ఇచ్చేవారు లేక‌పోతే.. ప‌క్కాగా పార్టీకి న‌ష్ట‌మ‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 6, 2025 6:42 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

46 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago