Political News

రేష‌న్‌కు సొమ్ములు.. బాబుకు ప్ల‌స్సా.. మైన‌స్సా.. !

రేష‌న్‌.. పేద కుటుంబాల‌కు ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేసే నిత్య‌వ‌స‌రాలు. ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌ల‌కు అందించే ఈ సరుకుల విష‌యంపై స‌ర్కారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. దీనిని ఇచ్చే విష‌యంపై క్లారిటీ ఉన్నా.. వీటిని ప్ర‌జ‌లు వినియోగించుకునే విష‌యంలో మాత్రం తేడా కొడుతోంది. దీనిపైనే ఇప్పుడు స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తోంది. తాజాగా రేష‌న్‌కు సొమ్ములు ఇస్తే బెట‌ర్ అనే ఆలోచ‌న చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త‌మవుతున్నాయి.

పేద‌ల‌కు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం భారీధ‌ర‌ల‌కే బియ్యాన్ని, ఇత‌ర స‌రుకుల‌ను కొనుగోలు చేస్తోంది. అయితే.. ప్ర‌జ‌లు బియ్యాన్ని తిన‌డం లేదు. నిజానికి ఎంత మంచి బియ్యం ఇచ్చినా.. `కోటా బియ్యం`గా ముద్ర ప‌డిన ద‌రిమిలా.. దీనిని తినేందుకు ల‌బ్ధిదారులు ముందుకు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోతోంది. దీనిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం మార్పు దిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

అయితే.. ఇక్క‌డే మ‌రో విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. పేద‌ల‌కు ఇస్తున్న బియ్యంలో 30 శాతం మందికి పైగానే పేద‌లు వాటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు వారిని పూర్తిగా త‌గ్గించి.. కేవ‌లం సొమ్ములు ఇస్తే.. స‌రిపోతుందా? అనేది ప్ర‌శ్న‌. పైగా.. రేష‌న్ బియ్యం కొన‌సాగుతున్నందునే.. మార్కెట్‌లో సాధార‌ణ బియ్యం ధ‌రలు ఓ మాదిరిగా అయినా నిల‌క‌డ‌గా ఉంటున్నాయి. అలా కాకుండా.. అంద‌రూ బ‌హిరంగ మార్కెట్‌పైనే ఆధార‌ప‌డ్డార‌న్న సంకేతాలు వ‌స్తే.. మాత్రం అప్పుడు బియ్యం మార్కెట్ను అదుపులో ఉంచ‌డం దుస్సా ధ్యం అంటున్నారు ప‌రిశీల‌కులు.

పైగా.. స‌ర్కారు రూ.45 చొప్పున రేష‌న్ బియ్యాన్ని బ‌హిరంగ మార్కెట్‌నుంచి లేదా మిల్ల‌ర్ల నుంచి కొని.. పేదలకు పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రేష‌న్ వ‌ద్ద‌నుకునే వారికి ఆ మొత్తాన్ని లెక్క‌గ‌ట్టి ఇస్తారా? అనేది సందేహం. ఎందుకంటే.. రూ.1కే ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు బియ్యాన్ని కొంటున్నారు. కానీ, ప్ర‌భుత్వం మాత్రం రూ.45-48 మ‌ధ్య ఖ‌ర్చు చేస్తోంది. రేపు రేష‌న్ మానేసి డ‌బ్బులు ఇవ్వాల‌ని అనుకుంటే.. రూ.45 చొప్పున పేద‌ల‌కు పంపిణీ చేస్తారా?  లేక‌.. రూ.1 కిందే జ‌మ‌క‌ట్టి.. ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం లెక్క‌లుమాత్రం స‌ర్కారుకు కొరుకుడు ప‌డ‌డం లేదు.

This post was last modified on June 4, 2025 4:11 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

24 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

32 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

36 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

57 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago