Political News

యోగా తో రికార్డులు టార్గెట్ చేసిన బాబు

ఏపీని ప్ర‌పంచంలోనే ముందుండేలా చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. క‌డ‌ప‌లో జ‌రుగుతున్న మ‌హానాడులో రెండో రోజు మాట్లాడిన ఆయ‌న‌.. యోగా నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్య‌క తీర్మానం చేశారు. వ‌చ్చే నెల 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ఏపీ ఆతిథ్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి ప్ర‌ధాని మోడీ హాజ‌రు అవుతున్నార‌ని.. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లువురు ప్ర‌తినిధులు కూడా వ‌స్తున్నార‌న్న ఆయ‌న‌.. ఈ క్ర‌మంలో ఏపీ అభివృద్ధిని కూడా ప్ర‌పంచ స్థాయికి వివ‌రించే కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు.

మ‌న బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా.. మ‌న పేరు మార్మోగేలా యోగాను నిర్వ‌హిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ఆర్కే బీచ్ నుంచి భీముని ప‌ట్నం వ‌ర‌కు 5 ల‌క్ష‌ల మందితో 25 కిలో మీట‌ర్ల మేర‌కు యోగా ను చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు. దీనికి టీడీపీ కార్యక‌ర్త‌లు త‌ర‌లి రావాల‌న్నారు. ఇలా నిర్వ‌హించ‌డం.. ఒక్క ఎన్డీయే ప్ర‌భుత్వానికి, టీడీపీ ప్ర‌భుత్వానికే సాధ్య‌మ‌ని చెప్పారు.

యోగాలో పాల్గొన‌డం గర్వ‌కార‌ణ‌మ‌న్న చంద్ర‌బాబు.. దీనిలో ముఖ్యంగా మంత్రులు అంద‌రూ పాల్గొనాలని సూచించారు. ఒత్తిడి, ప‌నిభారంతో ఇబ్బంది ప‌డుతున్న మంత్రులకు యోగా ద్వారా కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ స‌ర్టిఫికెట్ ఇస్తామ‌న్నారు. మే 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు యోగా మాసోత్స‌వంగా ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మ‌న అంద‌రికంటే కూడా.. విద్యాశాఖ మంత్రి(లోకేష్‌)పైనే ఎక్కువ‌గా బాధ్య‌త ఉంది అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మందికి స‌ర్టిఫికెట్లు ఇవ్వాల‌న్న ల‌క్ష్యం పెట్టుకున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. విశాఖ‌లో నిర్వ‌హించే యోగా దినోత్స‌వానికి ఊళ్ల‌కు ఊళ్లు త‌ర‌లి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికే యోగా శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభించిన‌ట్టు చెప్పారు. దీనిని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

This post was last modified on May 28, 2025 5:42 pm

Share

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

11 minutes ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

19 minutes ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

1 hour ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

2 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago