Political News

చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో..: కేంద్రానికి ప‌వ‌న్ లేఖ‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా గురువారం రాత్రి కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. దీనికి సంబంధించిన విష‌యాల‌ను ఆయ‌న ఎక్స్‌లో పంచుకున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వం లో రాష్ట్రం వ‌డివ‌డిగా అభివృద్ధి బాట ప‌డుతోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం స‌హకారంతో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డుతున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ల‌ల‌న్ సింగ్‌కు కృతజ్ఞ‌త‌లు చెబుతున్నామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

అభివృద్ధి అంటే.. ప్ర‌తి గ్రామానికి, ప్ర‌తి ప‌ల్లెకు, ప్ర‌తి ఒక్క‌రికి చేరువ కావ‌డ‌మేన‌ని, దానినే నిజ‌మైన అభివృద్ధి అంటార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పుడు అదే చేస్తోంద‌ని తెలిపారు. ముఖ్యంగా మ‌హాత్మా గాంధీ ఆద‌ర్శాల మేర‌కుగ్రామ స్వ‌రాజ్య‌ సాధ‌న‌కు నిజ‌మైన అంకిత భావంతో ప‌నిచేస్తున్న‌ట్టు చెప్పారు. గ్రామీణ భార‌త్ మ‌హోత్స‌వ్ పేరిట ప్ర‌ధాని మోడీ చేస్తున్న ప‌నులు దేశంలో గ్రామీణుల‌కు మేలు చేస్తున్నాయ‌ని కొనియాడారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చొర‌వ‌, ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కుప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇవ‌న్నీ.. గ్రామీణ ప్ర‌జ‌ల‌కు ఉద్దేశించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని పేర్కొన్నారు. గ్రామ స‌భ‌, ప‌ల్లె పండుగ‌, అడ‌వి త‌ల్లి బాట వంటివి చేప‌ట్ట‌డం ద్వారా గ్రామీణుల జీవితాల్లో స‌రికొత్త మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలిపారు. తాజాగా చేప‌ట్టిన మ‌న ఊరు.. మాటా మంతి కార్య‌క్ర‌మం ద్వారా గ్రామీణుల‌కు మ‌రింత భ‌రోసా క‌ల్పించే ఘ‌ట్టాన్ని చేప‌ట్టామ‌న్నారు.

కాగా.. గురువారం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాటా-మంతి పేరుతో వెండితెర వేదిక‌గా .. అనే క్యాప్ష‌న్‌తో గ్రామీణుల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రావి వ‌ల‌స గ్రామ ప్ర‌జ‌ల‌తో ఓ సినిమా హాలులో ఆయ‌న ఇంట‌రాక్ట్ అయ్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భ‌రోసా క‌ల్పించారు. వారి నుంచి విన‌తుల‌ను కూడా స్వీక‌రించారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కేంద్రానికి లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 23, 2025 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

11 minutes ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

2 hours ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

4 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

4 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

5 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

6 hours ago