Political News

జనసేనకు డిప్యూటీ… వైసీపీకి కార్పొరేటర్

ఏపీలో ఏడాది క్రితం ప్రభుత్వం మారిపోయింది. అప్పటిదాకా బలంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోగా… అప్పటిదాకా బొటాబోటీ సభ్యులున్న కూటమి రికార్డు విక్టరీ కొట్టి కాలర్ ఎగరేసిందనే చెప్పాలి. కూటమి సారథిగా ఉన్న టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా… కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత దాదాపుగా అన్ని స్థాయిల్లోనూ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇలాంటి క్రమంలో మంగళవారం అటు జనసేనకు ఫుల్ జోష్, వైసీపీకి ఓ మోస్తరు హుషారు తీసుకొచ్చే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి.

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో మొన్నటిదాకా వైసీపీ అధికార పార్టీగా కొనసాగగా… ఇటీవలే జరిగిన పరిణామాలతో ఆ అధికారం కూటమికి దక్కింది. టీడీపీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మేయర్ గా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్ గా పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం దక్కగా… జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీకి చెందిన గోవింద రెడ్డిని ఆ పదవికి ఎంపిక చేశారు. అయితే కూటమి పార్టీల మద్య అవగాహన లేమితో సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడగా…మంగళవారం మాత్రం ఏకగ్రీవంగానే గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డిని అభినందిస్తూ పవన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఇదిలా ఉంటే..జీవీఎంసీకి చెందిన ఓ టీడీపీ కార్పొరేటర్ మంగళవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. మంగళవారం తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కాగా…పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ సౌత్ నియోజకవర్గ ఇంచార్జీ వాసుపల్లి గణేశ్ లతో కలిసి వచ్చిన 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. పూర్ణిమకు స్వయంగా జగనే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెరసి మంగళవారం జీవీఎంసీలో జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కగా.. గుడ్డిలో మెల్ల మాదిరిగా టీడీపీకి చెందిన ఓ కార్పొరేటర్ చేరడంతో వైసీపీ కూడా ఒకింత సంబరపడింది.

This post was last modified on May 21, 2025 11:17 am

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago