Political News

ఇలా బెయిలు.. అలా జైలు.. బోరుగ‌డ్డ భోరుభోరు!

వైసీపీ నాయ‌కుడు, సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌.. రౌడీ షీట‌ర్‌.. బోరుగ‌డ్డ అనిల్ కుమార్ ప‌రిస్థితి జైలు-బెయిలు అన్న‌ట్టుగా మారింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా కేసుల్లో సోమ‌వారం బెయిల్ ల‌భించింది. హైకోర్టు ప‌లు ష‌ర‌తుల‌తో ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. గ‌తంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నారా లోకేష్‌, వంగ‌ల‌పూడి అనిత త‌దిత‌ర నాయ‌కుల‌పై అనిల్ నోరు పారేసుకున్నారు. తీవ్ర దుర్భాష‌ల‌తో చెల‌రేగిపోయారు. దీంతో కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక ఆయ‌న‌పై కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఆయ‌న‌ను కోర్టుకు హాజ‌రు ప‌రిచి జైలుకు త‌ర‌లించారు.

మ‌ధ్య‌లో మ‌ధ్యంతర బెయిల్ వ‌చ్చినా.. న‌కిలీ స‌ర్టిఫెకెట్లు(అమ్మ‌కు ఆరోగ్యం బాగోలేద‌ని) స‌మ‌ర్పించి కోర్టును త‌ప్పుదోవ‌ప‌ట్టించార‌న్న కార‌ణంగా.. మ‌రో కేసు న‌మోదైంది. ఇక‌, ఆయా కేసుల్లో బోరుగ‌డ్డ‌కు అత్యంత క‌ష్టం మీద బెయిల్ ద‌క్కింది. కానీ, ఆయ‌న ఇంకా జైలు నుంచి బ‌య‌ట‌కు రాలేదు. ఫార్మాలిటీస్‌ పూర్తి కాలేద‌ని.. అందుకే విడుద‌ల చేయ‌లేద‌ని మంగ‌ళ‌వారం అనంత‌పురం జైలు అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు బోరుగ‌డ్డ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. బెయిల్ వ‌చ్చినా బ‌య‌ట‌కు వ‌స్తానా? అనే అనుమానం ముసురుకుంది. ఈ అనుమాన‌మే నిజ‌మైంది. ప్ర‌స్తుతం అనంతపురం జైల్లో ఉన్న బోరుగ‌డ్డ‌ను గుంటూరు పోలీసులు అరెస్టు చేసి మ‌రో కేసులో రాజ‌మండ్రి సెంట్ర‌ల్‌ జైలుకు త‌ర‌లించారు.

ఏంటీ తాజా కేసు?

2015-16 మ‌ధ్య పెద‌కాకానిలోని త‌న స్థ‌లానికి స‌ర్వే చేసిన‌ట్టుగా స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని అధికారి మ‌ల్లికార్జున్‌పై బోరుగ‌డ్డ ఒత్తిడి చేశారు. అయితే.. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే తాను వ్య‌వ‌హ‌రిస్తాన‌ని మ‌ల్లికార్జున్ స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను ఓ రాత్రి బెదిరింపుల‌కు గురి చేశారు. దీనిపై అప్పట్లోనే మ‌ల్లికార్జున్ ఫిర్యాదు చేయ‌డంతో కాకాని పోలీసులు కేసు పెట్టారు. ఆ త‌ర్వాత‌.. ఈ కేసు ఏమైందో ఏమో తెలియ‌దు కానీ.. అనిల్ మాత్రం బాగానే బ‌య‌ట తిరిగాడు. ఇక‌, తాజాగా ఈ కేసును తిర‌గ‌దోడిన కాకాని పోలీసులు.. మంగ‌ళ‌వారం పీటీ వారెంట్‌పై జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ వెంట‌నే రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు.

This post was last modified on May 21, 2025 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క ఓటుతో కోడల్ని గెలిపించిన ‘అమెరికా మామ’

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…

1 hour ago

చ‌ర‌ణ్‌ vs నాని.. ఇద్ద‌రూ త‌గ్గేదే లే

సినిమాలకు సంబంధించి క్రేజీ సీజ‌న్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజ‌న్‌కు బాగా…

3 hours ago

‘కూట‌మి’లో ప్ర‌క్షాళన‌.. త్వ‌ర‌లో మార్పులు?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీల ప‌రంగా పైస్థాయిలో నాయ‌కులు…

4 hours ago

జన నాయకుడు మీద ఏంటీ ప్రచారం

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…

4 hours ago

అసలు యుద్ధానికి అఖండ 2 సిద్ధం

సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది…

5 hours ago

చిరు వెంకీ కలయిక… ఎంతైనా ఊహించుకోండి

మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై…

7 hours ago