Political News

24 గంట‌ల్లో ఆమ‌ర‌ణ దీక్ష చేస్తా: ష‌ర్మిల స్టేట్‌మెంట్‌

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 24 గంట‌ల్లో విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి.. ఇప్ప‌టికే తొల‌గించిన ఉద్యోగుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని ఆమె అల్టిమేటం జారీ చేశారు. ఈ క్ర‌మంలో 24 గంట‌ల త‌ర్వాత కూడా.. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోతే.. తానే ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతాన‌ని ఆమె హెచ్చ‌రించారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం చేస్తోంది. రేపటి లోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.

అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను నెర‌వేర్చ‌కుండా.. ఉద్యోగుల‌ను విధుల్లోకి తీసుకోకుండా ఉంటే.. ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే ఆమరణ దీక్షకు దిగుతున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. ‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికి సిద్ధం’ అని ష‌ర్మిల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణిగా పేర్కొన్నారు. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదని ఆక్షేపించారు.

‘కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం లేదు. దిక్కున్న చోట చెప్పుకోండనే రీతిలో యాజమా న్యం వ్యవహరిస్తోంది. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం. కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి అల్టిమేటం ఇస్తున్నాం. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి.’ అని ష‌ర్మిల డిమాండ్ చేశారు.

This post was last modified on May 19, 2025 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

14 minutes ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

14 minutes ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

1 hour ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

3 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

4 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

5 hours ago