వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు జైలు అధికారులు మళ్లీ అదే జైలును, అదే గదిని కేటాయించారు. తాజాగా నందిగం సురేష్ అరెస్టు కావడం తెలిసిందే. టీడీపీ నాయకుడిపై చేయి చేసుకున్నారన్న కేసులో మాజీ ఎంపీపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయనను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు.
ఈ క్రమంలో వచ్చే 2వ తేదీ(14 రోజులు) వరకు కోర్టు నందిగంకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీ సులు ఆయనను జైలుకు తరలించనున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గతంలో ఓ ఎస్సీ మహిళ హత్య కేసులో నందిగం అరెస్టయిన విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరియమ్మ హత్య జరిగిన క్రమంలో ఆమె కుటుంబం ఫిర్యాదు మేరకు.. నందిగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ సమయంలో నందిగంను… గుంటూరు జైలుకు తరలించారు. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉన్న నందిగం ఎట్టకేలకు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్త.. ఒకరు తన ఇంటి ముందు గలాభా చేశారని ఆరోపిస్తూ.. సదరు కార్యకర్తను నందిగం ఆయన అనుచరులు చితక్కొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తాజాగా నమోదైన కేసులో నందిగంను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.
ఈ క్రమంలో 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు అదే పాత జైలుకు తరలించేందుకు..అదే పాత బ్యారెక్(గది)ను కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనా చేసుకున్న వారికి చేసుకున్నంత.. అన్న సామెత వైసీపీనాయకుల విషయంలో స్పష్టమవుతోంది.
This post was last modified on May 19, 2025 12:59 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…