Political News

క‌డ‌ప‌-మాచ‌ర్ల‌.. ఒకేసారి వైసీపీకి రెండు దెబ్బ‌లు!

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ ఒకేరోజు రెండు భారీ ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. రెండు స్థానిక సంస్థ‌లు ఆ పార్టీ నుంచి చేజారిపోయాయి. వీటిలో ఒక‌టి.. ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల మునిసిపాలిటీ కాగా.. రెండోది వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌. ఈ రెండు మునిసిపాలిటీల చైర్మ‌న్‌ల‌పై కూట‌మి స‌ర్కారు బుధ‌వారం ఒక్క‌సారే వేటు వేసింది. వీటిలో ఒక‌రు నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం కార‌ణ‌మైతే.. మ‌రొక‌రు అవినీతి పాల్ప‌డ్డార‌న్న అభియోగాలు ఉండ‌డ‌మే కార‌ణం. దీంతో ఇద్ద‌రినీ కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది. ఇది వైసీపీకి భారీ ఎదురు దెబ్బేన‌ని అంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు.

ప‌ల్నాడులో..

ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల మునిసిపాలిటీలో 2021-22 మ‌ధ్య జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అండ‌తో వైసీపీ విజ‌యం దక్కించుకుంది. ఈ క్ర‌మంలోనే పిన్నెల్లి అనుచ‌రుడిగా పేరున్న కిషోర్‌కుమార్‌ను మాచ‌ర్ల మునిసిపాలిటీ చైర్మ‌న్ చేశారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై దృష్టి పెట్టింది. ఛైర్మన్‌ పదవి దుర్వినియోగం చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావ‌డంతో వాటిపై విచార‌ణకు ఆదేశించింది.

ఈ క్ర‌మంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో విచార‌ణ జ‌రిపి.. ప్ర‌బుత్వానికి నివేదిక అందించారు. అనుమతిలేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్‌ భేటీలకు కిషోర్ కుమార్ ఎగ్గొట్టార‌ని, ఇది మునిసిప‌ల్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 16(1)ని తోసిపుచ్చ‌డ‌మేన‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. దీంతో స‌ర్కారు ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. ఆ వెంట‌నే ముఖ్య‌కార్య‌ద‌ర్శి.. చైర్మ‌న్ కిషోర్‌కుమార్‌ను ప‌ద‌వీచ్యుతిడిని చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

క‌డ‌ప‌లో..

క‌డ‌ప మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా ఉన్న సురేష్‌బాబు అవినీతి పాల్ప‌డ్డార‌న్న ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న‌పై విచార‌ణ‌కు విజిలెన్సును నియ‌మించిన ప్ర‌భుత్వం పూర్తి అధికారాల‌ను క‌లెక్ట‌ర్ కు అప్ప‌గించింది. కార్పొరేష‌న్‌లో ప‌నుల‌ను కాంట్రాక్టు బేసిక్‌గా ఇవ్వ‌కుండా.. త‌న కుటుంబానికి ముఖ్యంగా త‌న భార్య పేరుతో ఉన్న కాంట్రాక్టు కంపెనీకి నామినేటెడ్ ప‌ద్ద‌తిపై ఇచ్చార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలో 36 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు అవినీతి జ‌రిగింద‌ని క‌లెక్ట‌ర్ గుర్తించారు. దీనిపై వివ‌ర‌ణ కోరుతూ.. మేయ‌ర్ సురేష్ బాబుకు ప‌లు ద‌ఫాలుగా నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణ సరిగా లేద‌ని గ్రహించిన ప్ర‌భుత్వం ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది.

This post was last modified on May 15, 2025 12:53 pm

Share

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

9 minutes ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

11 minutes ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

3 hours ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

6 hours ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

9 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

10 hours ago