Political News

పాక్ – భారత్ వివాదం.. చైనా+అమెరికా విషపు ఆలోచన!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు పెద్ద కారణమేనని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా చైనా అమెరికా వంటి అగ్రరాజ్యాలు భారత్, పాక్ లాంటి దేశాల మధ్య ఎప్పుడూ ఒక చీకటి గీత ఉండాలని కోరుకుంటున్నాయని భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ యుద్ధ వేడి వల్ల ఆయుధ వ్యాపారం బుమ్ అవుతుంది, బిలియన్ల డాలర్ల వ్యాపారం ఒక్క ఘర్షణ ద్వారా తిరుగులేని లాభాలను తెచ్చిపెడుతుందనేది వారి ఆలోచన.

చైనా విషయంలో మాట్లాడుకుంటే, భారత్ ఎదుగుదలతో అసూయపడుతూ పొరుగు దేశాల విషయంలో తప్పుడు వ్యూహాలు అమలు చేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పాక్‌తో ఆర్ధిక, సైనిక ఒప్పందాల పేరుతో చైనా పాక్షికంగా భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. చైనా మౌలిక సదుపాయాలను పాక్‌లో నిర్మించడం, గ్వాదర్ పోర్ట్ నుంచి వాణిజ్య మార్గాల దాకా ఆ దేశానికి మద్దతుగా నిలుస్తోంది. దీని వెనుక అసలు ఉద్దేశం భారత నియంత్రణకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్‌కి బలం చేకూర్చడమేనని నిపుణుల అభిప్రాయం.

అమెరికా విషయానికొస్తే, భారత్‌ను మిత్రదేశంగా అభివర్ణించినప్పటికీ, కాశ్మీర్ వంటి కీలక అంశాల్లో ఆ దేశ వైఖరిలో స్పష్టత లేదు. నిజంగా భారత్‌పై అండగా ఉండాలంటే, కాశ్మీర్ విషయంలో ఓ స్పష్టమైన మద్దతు ఇచ్చి పాక్‌ను ఒత్తిడికి గురిచేయొచ్చు. కానీ అమెరికా ఆయుధ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో తటస్థంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా తరువాత పాక్ కు ఇతర ఆయుధాలు ఎక్కువగా అమెరికా నుంచే వస్తాయి కాబట్టి. భారత్ పాక్ వివాదం కొనసాగుతుంటే రెండు దేశాల నుంచి డిఫెన్స్ బిజినెస్‌కి అవకాశాలు ఎక్కువగా వస్తాయి.

భారత ఆర్మీ దృష్టిలో చూస్తే, ఒక చిన్న ఆపరేషన్ సిందూర్‌తోనే పాక్ ఉగ్ర శిబిరాలు నేలమట్టం కావడం దీటైన ఉదాహరణ. అంటే సమస్యను శాంతిగా లేకుండా శక్తితో కూడా పరిష్కరించగల సామర్థ్యం భారత్‌కి ఉంది. కానీ అదే సమయంలో భారత్‌కి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడుల మద్దతు, భద్రతా అవగాహనలు అవసరం కావడంతో, వేడి చూపిస్తూ చీకటి వ్యూహాలు వేయాల్సి వస్తోంది.

మొత్తంగా చూస్తే, పాక్‌తో తేల్చుకోవాలనుకుంటున్న భారత్‌కు అసలు అడ్డంకి తామే అయినట్లుగా అమెరికా, చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నలు పెంచుతోంది. రాజకీయంగా మద్దతిస్తున్నామంటూ చెప్పినా, వాస్తవంగా మాత్రం ఆయుధాల వ్యాపారం, వ్యూహాత్మక ప్రాధాన్యత కోసం ఘర్షణను నిలబెట్టాలని చూస్తున్నట్లు అర్ధమవుతుంది.

This post was last modified on May 14, 2025 2:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

12 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago