Political News

సాయంత్రం చ‌ర్చ‌లు- అర్ధ‌రాత్రి దాడులు: తిప్పికొట్టిన భార‌త్‌

పాకిస్థాన్ త‌న ద‌మ‌న నీతిని మ‌రోసారి రుజువు చేసుకుంది. సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో భార‌త ఆర్మీ ఆప‌రేష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌తో పాకిస్థాన్ ఆర్మీ ఆప‌రేష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఫోన్ చేసి సుమారు గంట‌పాటు చ‌ర్చించారు. ఇక‌పై.. తాము స‌రిహ‌ద్దుల నుంచి సైన్యాన్ని వెన‌క్కి తిరిగి ర‌ప్పిస్తామ‌ని.. మీరు కూడా అలానే చేయాల‌ని పాక్ అధికారి కోరారు. దీనికి భార‌త్ అంగీక‌రించింది. అదేవిదంగా మేం మిస్సైళ్ల‌ను, డ్రోన్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌యోగించ‌బోమ‌ని.. ద‌య‌చేసి మీరు కూడా మీ మీ వ్య‌వ‌స్థ‌ల‌ను వెనక్కి పిల‌వాల‌ని పాక్ అధికారి ప్రాధేయ ప‌డ్డారు.

దీనికి కూడా భార‌త్ అంగీక‌రించింది. ఆ త‌ర్వాత‌.. గంట‌న్న‌ర వ్య‌వ‌ధిలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోంద‌ని.. దీనిని అంతం చేసే వ‌ర‌కు ఆ దేశానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగం ముగిసిన‌(8.22 నిమిషాల‌కు) గంట సేప‌టిలోనే పాకిస్థాన్ త‌న దుష్ట‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించింది. వాస్తవాధీన రేఖ వెంబ‌డి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సాంబ, ఆర్నియా సెక్టార్లలో కాల్పులు, డ్రోన్ల దాడితో మ‌రోసారి భీతావ‌హ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. దీంతో ప్ర‌జ‌లు భీతిల్లిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

దీంతో హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగించారు. దీంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సాంబా, ఆర్నియాలో డ్రోన్‌ కదలికలను గుర్తించిన భార‌త సైన్యం.. అంతే దీటుగా వాటిని ధ్వంసం చేసింది. భార‌త్ ప్ర‌యోగించిన డ్రోన్లు .. పాక్ డ్రోన్ల‌ను త‌క్ష‌ణం నేల కూల్చాయ‌ని అధికారులు తెలిపారు. ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని పేర్కొన్నారు. కాగా.. పాక్ మ‌రోసారి దుస్సాహ‌సానికి దారితీయ‌డంతో పంజాబ్, రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ చేశారు. అంటే.. అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు.

కాగా.. పాక్ మ‌రోసారి కాల్పుల‌కు, డ్రోన్ దాడుల‌కు దిగ‌డం ప‌ట్ల‌.. అధికారులు సోమ‌వారం అర్ధ‌రాత్రి మ‌రోసారి చ‌ర్చించారు. ఎలాంటి ప‌రిస్థితినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. స‌రిహ‌ద్దుల వెంబ‌డి సైన్యాన్ని వెన‌క్కి ర‌ప్పించ‌రాద‌ని.. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న సైన్యాన్ని అలానే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించా రు. ఇదిలావుంటే.. మంగ‌ళ‌వారం అమెరికాతో భార‌త్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు.

This post was last modified on May 13, 2025 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

1 hour ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

2 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

3 hours ago

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

5 hours ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

5 hours ago

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

6 hours ago