Political News

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశాం: ప్ర‌ధాని మోడీ

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌వాద దాడికి ప్ర‌తీకారంగా భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆప‌రేష‌న్ సిందూర్ అంటే.. కేవ‌లం ఆప‌రేష‌న్ కాద‌ని.. దేశంలోని కోట్లాది మంది మ‌హిళ‌ల సిందూరానికి ప్ర‌తీక‌గా పేర్కొన్నారు. తొలుత ఆయ‌న శౌర్య ప‌రాక్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించిన భార‌త సైన్యానికి, స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌కు సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌న్నారు.

ఆప‌రేష‌న్ సిందూర్‌.. అనేది కేవ‌లం మాట కాద‌ని.. ఇది కోట్లాది మంది మ‌హిళ‌లకు చిహ్న‌మ‌ని పేర్కొన్నారు. ప‌హ‌ల్గాంలో అమా య‌కుల‌ను పొట్టున పెట్టుకున్నార‌ని చెప్పారు. అమాయ‌క పౌరుల‌ను పాకిస్థాన్ పొట్ట‌న పెట్టుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌తం పేరు అడిగి మ‌రీ ప్రాణాలు తీశార‌ని.. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌న్నారు. కుటుంబ స‌భ్యుల ముందే.. అయి న వారిని పొట్ట‌న పెట్టుకున్నార‌ని.. ఇలాంటి వాటిని భార‌త దేశం ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌బోద‌న్నారు. గ‌త నాలుగు రోజులు గా భార‌త సైన్యం సంయ‌మ‌నంతో మ‌న సైన్యం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు.

ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేయాల్సిన పాకిస్థాన్‌.. ఎదురు మ‌న‌పై దాడులు చేసింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌.. పాకిస్థాన్‌కు త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు. భార‌త సైన్యం చూపిన తెగువ‌కు పాక్ నిరాశ నిస్పృహ‌ల్లో కూరుకుపోయింద ని.. అచేత‌న స్థితికి చేరుకుంద‌ని ప్ర‌ధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. భార‌త్ చేస్తున్న దాడుల‌తో పాక్ కు దిమ్మ‌తిరిగిపోయింద‌ని త‌న‌దైన శైలిలో ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఉగ్ర‌వాదులు క‌ల‌లో కూడా ఊహించ‌నంత దారుణంగా భార‌త్ వారిని తుడిచి పెట్టేసింద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త సైన్యం క‌చ్చిత‌మైన ల‌క్ష్యంతో దాడులు చేసింద‌ని.. దీంతో పాక్ కు దిక్కులేకుండా పోయింద‌న్నారు.

మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం..

భార‌త సైన్యం, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు.. వంటివి మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి మోడీ చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు ఇలా.. అన్ని చోట్లా మ‌నం స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ధి చెప్పడంలో మ‌న బ‌లం, బ‌ల‌గం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

This post was last modified on May 12, 2025 10:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Modi

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago