విధేయత, అణుకువ, పార్టీ అధినేత పట్ల అత్యంత గౌరవ మర్యాదలు ప్రదర్శించి.. విధేయతకు కేరాఫ్‌గా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక ఆప్కాబ్ చైర్మన్ పదవితో వీరతాడు వేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న గన్ని వీరాంజనేయులకు కీలకమైన పదవిని ఇచ్చి ఆయన సేవలను చంద్రబాబు గుర్తించారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా ఇటీవలే నియమించిన ఆయనను కీలకమైన ఆప్కాబ్ చైర్మన్ పదవిని ఇచ్చి పార్టీలో కష్టపడిన వారికి ఎలాంటి ఢోకా ఉండదన్న సంకేతాలు అందించారు.
త్యాగం-కష్టం!
గన్ని వీరాంజనేయులు.. టీడీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ అంటే ప్రాణం పెట్టే ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా వైసీపీ హవాలో గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అయినప్పటికీ 2019-24 మధ్య నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉన్నారు. వివాదాలకు దూరంగా ప్రజల మనిషిగా, నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక, 2024లో పోటీకి సిద్ధమైన నేపథ్యంలో ఉంగుటూరు స్థానాన్ని టీడీపీకి అధినేత జనసేనకు కేటాయించారు.
అయినప్పటికీ గన్ని కుంగిపోలేదు. పార్టీపై విమర్శలు చేయలేదు. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యంగా భావించారు. ఆ క్రమంలోనే ఆయన విధేయతను మరింత ఎక్కువగా చూపారు. దీంతో వీలైతే ఎమ్మెల్సీ లేదా మరో ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తామంటూ అప్పట్లో చంద్రబాబు, నారా లోకేశ్ లు గన్నికి పూర్తి భరోసా ఇచ్చారు. అయితే.. కొన్నాళ్లుగా భర్తీ అవుతున్న ఎమ్మెల్సీల స్థానంలో తనకు ఒక్కటైనా దక్కుతుందని అనుకున్నా.. అవి కూడా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో గన్నికి పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు బలమైన నామినేటెడ్ పదవి దక్కడం గమనార్హం.
వాస్తవానికి ఆప్కాబ్ చైర్మన్ కావాలంటే ముందస్తుగా డీసీసీబీ చైర్మన్ గా నియమితులు కావాలి. ఈ నేపథ్యంలోనే ఏలూరు డీసీసీబీ చైర్మన్ గా గన్నిని నియమించారు. గన్నికి ఇచ్చిన ప్రాధాన్యం పట్ల పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా వుంటే, నియోజకవర్గంలో కూటమి పార్టీలతో కలుపుగోలుగా ఉండడం.. వివాదాలకు దూరంగా వ్యవహరించడం.. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించడం వంటివి గన్నికి కలిసి వచ్చిన పరిణామాలుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆప్కాబ్ చైర్మన్ అంటే.. కేబినెట్ హోదాతో సమానమని అంటున్నారు.
This post was last modified on May 12, 2025 4:03 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…