Political News

వారి క‌న్నీళ్లు చూసి.. క‌రిగిపోయిన ప‌వ‌న్‌!

రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రి, ఒక పార్టీకి అధినేత‌.. భ‌యంక‌ర‌మైన అభిమానుల కోలాహలం.. ఇంత పెద్ద హంగామా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌వారి క‌ష్టాన్ని చూసి ఆయ‌న చ‌లించిపోయారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చే క్ర‌మంలో ఆయ‌నా క‌న్నీరు పెట్టుకున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌ లో పాల్గొని జ‌మ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో పాక్ ఎదురు కాల్పుల్లో అమ‌ర‌వీరుడైనా అనంత‌పురం జిల్లా కిళ్లి తండాకు చెందిన అగ్నివీర్ ముర‌ళీనాయ‌క్‌.. అంత్య‌క్రియ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు.

ఉద‌యం మంత్రులు నారా లోకేష్‌.. అనిత, స‌విత‌ల‌తో క‌లిసి వీర జ‌వాన్ ఇంటికి వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత్య‌క్రియల ఘ‌ట్టం వ‌ర‌కు అక్క‌డే ఉన్నారు. ఒక్క‌గానొక్క కుమారుడిని శ‌త్రుదేశం పొట్ట‌న పెట్టుకున్న తీరుతో అగ్నివీర్ ముర‌ళీనాయ‌క్ త‌ల్లిదండ్రుల క‌న్నీటి సుడిలో చిక్కుకుపోయారు. తీవ్ర విషాద భ‌రిత‌మైన‌ అలాంటి సంద‌ర్భంగా వారిని ఓదార్చ‌లేక ప‌వ‌న్ క‌ల్యాణ్ వారి బాధ‌ను చూసి.. గుండెలు అవిసేలా విల‌పిస్తున్న జ్యోతిబాయిని చూసి క‌న్నీరు పెట్టుకున్నారు.

అతిక‌ష్టం మీద వారిని ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. అంతిమ సంస్కారానికి పార్థివ దేహం వెడ‌లుతున్న స‌మ‌యంలో మ‌రింత‌గా ఆ మాతృమూర్తి క‌న్నీటిలో క‌రిగిపోయారు. కొడుకా.. కొడుకా.. అంటూ త‌ల‌బాదు కుంటూ.. త‌న దిక్కులు పిక్క‌టిల్లేలా విల‌పించారు. ఇక‌, కొడుకు అమ‌ర‌డైన బాధ‌ను పంటిబిగువ‌న భ‌రించిన ఆయ‌న తండ్రి.. అతి క‌ష్టం మీద అంత్య‌క్రియ‌ల కోసం ముందుకు సాగారు. ఈ కార్య‌క్ర‌మంలో తుది వ‌ర‌కు పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌, అనిత స‌హా ప‌లువురు విష‌ణ్ణ వ‌ద‌నాల‌తో క‌నిపించారు.

This post was last modified on May 11, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

4 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

6 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago