Political News

పంతం నాదా-నీదా.. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. !

పంతాల‌కు పోవ‌ద్దు.. క‌లిసి మెలిసి ప‌నిచేయండి.. అని సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చెబుతున్నారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గాల గొడ‌వ‌ల‌ను పెద్ద‌వి కూడా చేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న సూచిస్తున్నారు. అయినా.. ఆయ‌న మాట‌ల‌ను పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకున్న‌ట్టుగా క‌నిపించడం లేదు. క‌ర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీ శ‌బ‌రికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న పరిస్థితి క‌నిపిస్తోంది. ఎక్క‌డిక్క‌డ నాయ‌కులు శ‌బ‌రికి వ్య‌తిరేకంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. వీరికంటే నేనేం త‌క్కువ అంటున్న శ‌బ‌రి కూడా.. అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో అటు వ్య‌క్తిగ‌తంగా నాయకులు, ఇటు పార్టీ ప‌రంగా టీడీపీ కూడా చిక్కుల్లో ప‌డుతున్నాయి. తాజాగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జ‌య‌సూర్య‌కు.. ఎంపీ శ‌బ‌రికి మ‌ధ్య ఉన్న వివాదాలు.. కాస్తా రోడ్డెక్కాయి. ఇది అధికారిక కార్య‌క్ర‌మం సాక్షిగా వెలుగులోకి రావ‌డంతో పార్టీపై జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది? ఎందుకు ఇలా నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేకుండా పోయిందన్న‌ది ఆస‌క్తిగా మారింది. చంద్ర‌బాబు చెప్పింది వారికి అర్ధం కావ‌డం లేదా? లేక వారే వినిపించుకోవ‌డం లేదా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగిందంటే.. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా ఫైర్ స్టేష‌న్‌ను నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి శంకు స్థాప‌న జ‌ర‌పాల‌ని సంబంధిత అధికారుల‌ను మంత్రి అనిత ఆదేశించారు. దీంతో అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలో ప్రొటోకాల్ ప్ర‌కారం.. క‌ర్నూలు ఎంపీ, నందికొట్కూరు ఎమ్మెల్యేల‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. అయితే.. త‌న నియోజ‌కవ‌ర్గంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మానికి ఎంపీని ఎందుకు పిలిచారంటూ.. అధికారుల‌ను నిల‌దీసిన జ‌య‌సూర్య‌.. ఆ త‌ర్వాత అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ముహూర్తం స‌మ‌యాన్ని క‌నుక్కుని.. ఎంపీ రావ‌డానికి ముందే వెళ్లి.. శంకుస్థాప‌న చేసేశారు.

అనంత‌రం.. త‌న మానాన త‌ను వెళ్లిపోయారు. అయితే.. ఈ విష‌యం తెలియ‌ని ఎంపీ శ‌బ‌రి.. అక్క‌డ‌కు చేరుకునే స‌రికి అదికారులు కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే శంకుస్థాప‌న చేసేశార‌ని చెప్పారు. దీంతో ఎంపీ.. ప్రొటోకాల్ ప్ర‌కారం తాను వ‌చ్చే దాకా ఎందుకు ఆగ‌లేద‌ని అధికారుల‌ను నిల‌దీశారు. ఏతావాతా ఇద్ద‌రితోనూ.. అధికారులుచీవాట్లు తిన్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యే చేసిన శంకుస్థాప‌నకు ప‌క్క‌నే శ‌బ‌రి కూడా.. మ‌రో శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం చేసి.. వెళ్లిపోయారు. అంతేకాదు.. వ‌స్తూ.. వ‌స్తూ.. త‌న‌ను పిలిచిన‌ప్పుడు.. త‌న‌తోనే శంకుస్థాప‌న చేయించాల‌ని.. నిధులు ఇచ్చేది ఎవ‌ర‌నేది కాద‌న్నారు. దీంతో అధికారులు అవాక్క‌య్యారు. ఇక‌, జ‌య‌సూర్య వెంట వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ఆయ‌న‌తో వెళ్లిపోయారు. శ‌బ‌రి వెంట త‌క్కువ మంది మాత్ర‌మే కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. దీంతో టీడీపీలో జ‌రుగుతున్న వివాదాలు మ‌రోసారి వీధికెక్కాయ‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది.

This post was last modified on May 11, 2025 3:09 pm

Share

Recent Posts

ఎపిక్ క్లైమాక్స్… ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్న నిర్మాత

ఈ శుక్రవారం విడుదల కానున్న ఎపిక్ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఇటీవల…

16 minutes ago

నిజం గెలిచింది… నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న లోకేష్‌

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…

2 hours ago

చైతు & దుల్కర్ – లక్కీ ఛాన్స్ కొట్టేశారా?

పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ…

2 hours ago

చాట్‌ GPT ఆస్ట్రా 6… భయపడుతున్న యువత

AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…

3 hours ago

ఒరాంగుటాన్లు… దేశాలు దాటి ఇక్కడికెలా వచ్చాయో..?

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…

3 hours ago

ఫౌజీ తప్పుకుంటే… స్పిరిట్ ఏం చేస్తుంది

భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…

4 hours ago