Political News

ట్రంప్‌ది ప్ర‌య‌త్న‌మే.. విజ‌యం మోడీదే..

భార‌త్-పాకిస్థాన్‌ల మ‌ధ్య త‌లెత్తిన భీక‌ర ఉద్రిక్త‌త‌లు.. దాడుల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. దీనిని యావ‌త్ భార‌త దేశం హ‌ర్షిస్తోంది. అయితే.. అమెరికా మీడియా స‌హా.. ప‌లు ప్ర‌పంచ స్థాయి మీడియా చానెళ్లు.. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఆయ‌న జోక్యం కార‌ణంగానే పాక్‌-భార‌త్ ల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల‌కు..యుద్ధానికి దారి తీసే ప‌రిస్థితులు కూడా స‌మ‌సిపోయాయ‌ని.. పేర్కొంటున్నాయి. ట్రంప్ ఈజ్ హీరో.. అంటూ అమెరికా మీడియా సీఎన్ ఎన్ పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఆచి తూచి స్పందించింది. ట్రంప్ ప్ర‌తిపాద‌న‌ అంటూ.. రాసుకొచ్చింది.

అయితే.. భార‌తీయులు స‌హా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌త సంత‌తి పౌరులు మాత్రం ఈ విజ‌యం ప‌క్కా మోడీదేన‌ని చెబు తున్నారు. శాంతి కాముక దేశంగా భార‌త్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన మోడీ.. భార‌త్‌-పాక్‌ విష‌యంలోనూ అదే పంథాను అనుస‌రించార‌ని చెబుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ మేర‌కు నెటిజ‌న్లు మోడీకి జేజేలు ప‌లుకుతున్నారు. ప్ర‌ధానంగా ఇక్క‌డ ట్రంప్ విజ‌యం అని పేర్కొన‌డాన్ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. స‌ర్వ‌శ‌క్తి మంతంగా ఉండి కూడా.. భార‌త్ ఈ విష‌యంలో ఒక అడుగు వెన‌క్కి వేసిందంటే.. అది మోడీ విజ‌య‌మే త‌ప్ప‌.. ట్రంప్‌ది కాద‌ని తేల్చి చెబుతున్నారు.

దీనికి రెండు ప్ర‌ధాన కార‌ణాల‌ను నెటిజ‌న్లు చూపిస్తున్నారు. 1) ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ విష‌యంలోనూ ట్రంప్‌ మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేశారు. యుద్ధం ఆపేయాల‌ని ఇరు దేశాల‌కు అనేక సార్లు విన్న‌వించారు. కానీ.. వీరి మ‌ధ్య యుద్ధం ఆగ‌లేదు. అంటే.. ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. 2) గాజా-ఇజ్రాయెల్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు, భీక‌ర దాడుల‌ను స‌మ‌సిపోయేలా చేయ‌డంలోనూ ట్రంప్ పాత్ర‌లేద‌ని.. ఇరు వ‌ర్గాలు.. ఒక ఒప్పందానికి వ‌చ్చాయ‌ని.. ఆ త‌ర్వాతే ఆగాయ‌ని అంటున్నారు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ మాటు వేసి దాడి చేసిన తీరును క‌ళ్ల‌కు క‌డుతున్నారు.

ఏతావాతా.. ట్రంప్ చేసిన మ‌ధ్య‌వ‌ర్తిత్వం మంచిదే అయినా.. భార‌త ప్ర‌ధాని మోడీ స‌మ‌రానికి మొగ్గు చూప‌ని కార‌ణంగానే ఇది క్ష‌ణాల్లో ఫ‌లితాన్ని ఇచ్చింద‌న్న‌ది నెటిజ‌న్లు చెబుతున్న మాట‌. అంతేకాదు.. భార‌త్ ద‌గ్గ‌ర స‌ర్వ సైన్యం ఉంద‌ని.. వ‌న‌రులు కూడా పుష్క‌లంగానే ఉన్నాయని.. ఎలా చూసుకున్నా.. భార‌త్ వెన‌క్కి త‌గ్గేందుకు అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. పైగా బాధిత దేశం కూడా కావ‌డంతో ఎవ‌రూ వేలు పెట్టి ఆదేశించే ప‌రిస్థితి కూడా లేద‌ని.. అయినా.. మోడీ స‌హా భారతీయులు సార్వ‌జ‌నీన ప్ర‌యోజ‌నాల‌ను, శాంతికి ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలోనే ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం స‌క్సెస్ అయింది త‌ప్ప‌.. ఇది ట్రంప్ ఏక‌ప‌క్ష విజ‌యం కాద‌నేది వారి మాట‌. మొత్తానికి మోడీకి నెటిజ‌న్లు జేజేలు ప‌లుకుతున్నారు.

This post was last modified on May 11, 2025 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

43 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago