Political News

పాక్ వ‌క్ర‌బుద్ధి: `ఒప్పందానికి` తూట్లు.. మ‌ళ్లీ కాల్పులు

పాకిస్థాన్ త‌న వ‌క్ర‌బుద్దిని మ‌రోసారి బ‌య‌ట పెట్టుకుంది. భార‌త్ దాడుల‌కు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయించుకుని.. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ముందుకు వ‌చ్చింది. దీంతో భార‌త్ కూడా.. స‌రేన‌ని ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్ర‌కారం.. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి ఇరు దేశాలు కూడా.. కాల్పులకు పాల్ప‌డ‌కూడ‌ద‌ని.. పాల్ప‌డ‌వ‌ని కూడా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని, భార‌త్‌, పాకిస్థాన్‌లు కూడా ధ్రువీక‌రించారు. ఈ నెల 12న జ‌రిగే స‌మావేశంలో ఒప్పందానికి సంబంధించిన కీల‌క విష‌యాలపై చ‌ర్చిస్తామ‌ని కూడా చెప్పాయి.

కానీ, ఒప్పందం విష‌యంపై ఒక‌వైపు ఇరు దేశాలు స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ స‌మ‌యంలోనే రాత్రి 8.45 గంట‌ల నుంచి క‌శ్మీర్‌లో పేలుళ్లు ప్రారంభ‌మ‌య్యాయి. పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల వైపు నుంచి మోర్టార్లు, పేలుడు ప‌దార్థాల‌తో త‌మ రాష్ట్రంలోని స‌రిహ‌ద్దు ప్రాంతాలన్నీ మోతెక్కిపోయాయ‌ని జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా సంబంధించి వీడియోలతో స‌హా.. ట్వీట్ చేశారు. “కాల్పుల విర‌మ‌ణ ఏమైంది? జ‌మ్ము క‌శ్మీర్‌లో ఈ పేలుళ్లు, మోత‌లు ఎందుకు?“ అని ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ప్ర‌శ్నించారు.

శ్రీన‌గ‌ర్‌లో వైమానిక ద‌ళాలు.. దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయ‌ని ఒమ‌ర్ అబ్దుల్లా పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియోను కూడా ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. మ‌రోవైపు.. జ‌మ్ము క‌శ్మీర్‌లో డ్రోన్ దాడులు జ‌రుగుతున్నాయ‌ని `టైమ్స్ ఆఫ్ ఇండియా` కూడా సంబంధిత వీడియోల‌ను త‌న వెబ్ సైట్‌లో పొందుప‌రిచింది. కాల్పుల విర‌మ‌ణ‌కు పాక్ తూట్లు పొడిచినట్టు పేర్కొంది. అయితే.. ఈ విష‌యాల‌పై ముందుగానే అప్ర‌మ‌త్త‌మైన భార‌త ప్ర‌భుత్వం ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఎదుర్కొనేందుకు సిద్ధ‌మేన‌ని మ‌రోసారి ప్ర‌క‌టించింది. స‌రిహ‌ద్దుల భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేసింది.

అదేవిధంగా విధుల్లో ఉన్న సైన్యాన్ని ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకోవాలిన ఆదేశించింది. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై భార‌త్‌-పాక్‌ల‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా.. పాకిస్థాన్‌ను న‌మ్మ‌రాద‌న్న విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని మీడియా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 10, 2025 11:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago