ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఈ వీడియోలో వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ.. పోలీసు అధికారులను నెట్టివేస్తున్న దృశ్యాలతో పాటుగా రజినీని చాకచక్యంగా తప్పించి ఆమె కారులోని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులను అడ్డగించే క్రమంలో రజినీ సాగిన తీరుతో పాటు.. పోలీసు అధికారులు ఆమెకు హెచ్చరికలు జారీ చేసిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది.
గతంలో టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రజినీ… 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి వైసీపీ చేరారు. చిలకలూరిపేట నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినీకి రెండున్నరేళ్ల తర్వాత జగన్ మంత్రిగా అవకాశం కల్పించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన రజినీ… మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా రజినీపై ఏసీబీ కేసు కూడా నమోదు కాగా… రజినీ మరిదిని పోలీసులు ఇప్పటికే అరెస్టు కూడా చేశారు.
తాజాగా రజినీ అనుచరుల్లో ముఖ్యుడిగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి చిలకలూరిపేట నుంచి ఎక్కడికో కారులో రజినీ వెళుతున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి రజినీ కారును అడ్డగించిన పోలీసులు… శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏ కేసులో ఆయనను అరెస్టు చేస్తున్నారో చెప్పాలని రజినీ పోలీసులను ప్రశ్నించారు. అందుకు పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదు. అంతే… కారులో నుంచి దిగిన రజినీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
కారులో నుంచి దిగిన వెంటనే డోర్ ను బలవంతంగా మూసేసిన రజినీ… తనను అడ్డుకునేందుకు వచ్చిన సీఐని దాదాపుగా తోసేసినంత పని చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రజినీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇదెక్కడి తీరు అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. కేసు ఏమిటో చెప్పకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో మీపై ఆల్రెడీ ఓ కేసు ఉందని. అడ్డుకుంటే…మరో కేసు పెడతానంటూ ఓ పోలీసు అదికారి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మరింత ఘాటుగా స్పందించిన రజినీ… చేయండి, ఎలా చేస్తారో చూస్తానంటూ ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలోనే రజినీని లాఘవంగా డోర్ నుంచి దూరంగా తప్పించిన పోలీసులు కారులోకి ఎక్కి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on May 10, 2025 9:29 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…